దేశంలోనే నంబర్ 1 ధనవంతుడైన రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి షాక్ తగిలింది. అనిల్ అంబానీతోపాటు టీనా అంబానీ, కుమారులు జై అన్ మోల్, జై అన్షూల్ స్విస్ బ్యాంకు అకౌంట్ వివరాలను భారత ప్రభుత్వానికి అందించేందుకు స్విస్ బ్యాంకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టు అంగీకరించింది.
అనిల్ అంబానీ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలు పొందేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఫారెన్ టాక్స్, రీసెర్చ్ డివిజన్ కొద్దిరోజుల క్రితం ఫెడరల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఏప్రిల్ 29న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ 2011 నుంచి 2018 వరకు గల అనిల్ అంబానీ, ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు కావాలని ఫారెన్ టాక్స్, రీసెర్చ్ డివిజన్ కోరింది. రిలయన్స్ గ్రూపు అధినేతకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే అంశాలపై పరిశీలన జరిపేందుకు ఈ వివరాలు కావాలని కోరింది.
ఇటవల లండన్ కోర్టులో తన వద్ద డబ్బులు లేవని.. తన అన్న ముకేష్ అంబానీ సాయంతో జీవిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. చైనా బ్యాంకుల కన్సార్టియం నుంచి అనిల్ కంపెనీలు 1400 కోట్ల డాలర్ల రుణం తీసుకున్నాయి. 77 కోట్లు డాలర్లు చెల్లించలేకపోయాయి. దీంతో ఫారెన్ టాక్స్ అనిల్ అంబానీ స్విస్ ఖాతాల్లో మనీని స్వాధీనం చేసుకునే పనిలో పడింది.