దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి గుజరాత్ రాష్ట్ర ఎన్నికలు. భవిష్యత్‌రాజకీయాల్ని ప్రభావితం చేసే సత్తా గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నాయని చెప్పక తప్పదు. వరుస విజయాలతో దూసుకెళుతున్న బీజేపీకి.. మోడీ సొంత రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకూ వెల్లడైన సర్వే రిపోర్టుల ఆధారంగా బీజేపీ విజయం ఖాయమని చెబుతున్నా.. గతం కంటే సీట్లు తగ్గే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ఇదిలా ఉంటే బీజేపీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ భారీగా కసరత్తు చేస్తోంది. పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ను పోల్ సీన్లోకి తెచ్చి చేయిస్తున్న ప్రచారం కమలనాథులకు కొత్త కష్టాన్ని తెచ్చి పెడుతోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తమకు ఇబ్బందగా మారిన హార్దిక్ పటేల్ ఇరుకున పడేలా.. ఒక యువతితో అతగాడు చేస్తున్నారని చెప్పే శృంగార లీలల సీడీ బయటకు వచ్చింది.
ఈ సీడీతో తనకు సంబంధం లేదని.. ఆ సీడీలో ఉన్నది తాను కాదని హార్దిక్ చెబుతున్నారు. ఈ సీడీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ కు అనుకోని రీతిలో ఒక దళిత నేత నుంచి అనుకోని రీతిలో స్పందన వచ్చింది. దళిత యువనేత జిగ్నేశ్ మెవానీ రియాక్ట్ అవుతూ.. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.
హార్దిక్ నీ వెంట నేనున్నా.. శృంగారం అనేది ప్రాధమిక హక్కు.. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదంటూ ట్వీట్ చేసిన ఆయన.. హార్దిక్ చేసింది ఎంత మాత్రం తప్పేం కాదంటూ సమర్థించారు.
అంతేకాదు.. సీడీని అప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. కోర్టుకు ఈడ్చాలంటూ జిగ్నేశ్‌కు సలహా ఇచ్చారు. ఇంతకీ ఈ జిగ్నేశ్ ఎవరంటే.. గుజరాత్ లో దళిత హక్కుల కోసం పోరాడుతున్న నేత. గడిచిన ఏడాది ఉన్నావ్ లో దళితులపై దాడి తర్వాత వారికి మద్దతుగా నిలిచారు జిగ్నేశ్.. హార్దిక్ ను దెబ్బ కొట్టాలన్న లక్ష్యంగా సీడీని బయటకు తెస్తే.. అనూహ్యంగా దళిత నేత హార్దిక్ కు అండగా ఉంటాననటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనికి హార్దిక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.