జియో ఫోన్.. అంతర్జాలాన్ని అందరి అరచేతుల్లోకి తీసుకొచ్చిన దిగ్గజ సంస్థ. ప్రస్తుత కాలంలో జియోకు ముందు... జియో తర్వాత అని చెప్పుకునే అంతటి రికార్డు ఉన్న టెలికం సర్వీసెస్ సంస్థ. అతితక్కువ ధరకే డేటాను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు ఏడాది పాటు ఉచితంగా ఇచ్చింది. ఈ క్రమంలోనే భారతదేశంలోని కుగ్రామాల్లో సైతం సాంకేతికత పెరిగిపోయింది. క్రమంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. తర్వాత వెనువెంటనే రూ.250తో ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూరల్ పీపుల్ కు అనువైన ఫీచర్లతో జియో బుల్లి ఫోన్ విడుదలైంది. ఇక దాని ఫీచర్లతో అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వినియోగదార్లను రాబట్టుకుంది. ఇంతటి సంచలనాలు సృష్టించిన జియో... మరో అడుగు ముందుకేసింది. ప్రముఖ సంస్థ గూగుల్ తో కలిసి తక్కువ ధరతో సరికొత్త ఫీచర్లతో ఓ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఆ ఫోన్ ధరను ప్రకటించింది.
రిలయన్స్ సంస్థ జియోఫోన్ నెక్ట్స్ ధరను తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ ను రూ.6,499కి విక్రయించనున్నట్లు నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్ట్స్ మార్కెట్ లోకి రానుందని వెల్లడించింది. అంతేకాకుండా వినియోగదారుల సౌలభ్యం కోసం ఈఎంఐ వెసలుబాటును కల్పించింది. తొలుత రూ.1,999 చెల్లించి... మిగతా బ్యాలెన్స్ ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చని ప్రకటించింది. నాలుగు రకాల ఆప్షన్లతో ఈఎంఐ విధానాన్ని అమల్లోకి తీసుకురానన్నట్లు వివరించింది. కాగా జియోఫోన్ నెక్స్ట్ కు సంబంధించిన వీడియోను ఇటీవలె విడుదల చేసింది. ఈ క్రేజీ ఫోన్ ను ప్రకటించిన నాటి నుంచి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే అందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట శోధిస్తూనే ఉన్నారు
ఈ దీపావళికి మార్కెట్ లోకి విడుదల అవుతున్న జియో ఫోన్ నెక్ట్స్ అప్డేట్స్ తో ఓ వీడియోను విడుదల చేసింది. మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్ పేరిట ఓ వీడియోను చిత్రీకరించింది. ఈ ఫోన్ హైలెట్స్, ఫీచర్లు, దీని తయారీ ముఖ్య ఉద్దేశంతో ఆ వీడియోను రూపొందించింది. ఈ ఫోన్ కోసం గూగుల్, జియో సంయుక్తంగా ప్రగతి సరికొత్త ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) అభివృద్ధి చేశాయి. అతి తక్కువ ధరలోనే ఎంతోగొప్ప అనుభూతి పొందేవిధంగా ఈ ఫోన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను కేవలం భారతీయుల కోసమే అభివృద్ధి చేసినట్లు జియో ప్రతినిధులు చెబుతున్నారు. ఇకపోతే అతి తక్కువ ధరతోనే అందరినీ ప్రగతిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు వెల్లడించారు.
హైలెట్స్
ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్
వాయిస్ అసిస్టెంట్
గట్టిగా చదవడం
స్మార్ట్ కెమెరా
ట్రాన్స్ లేషన్
ఫ్రీ లోడెడ్ జియో, గూగుల్ యాప్
ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్డేట్
బ్యాటరీ
5.45 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే
3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం
13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్