కాశ్మీర్ విషయంలో పాక్ అనుసరిస్తున్న దూకుడుకు.. మహా దూకుడే మంత్రంగా మోడీ సర్కారు ముందుకు సాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా పాక్ తో యుద్ధం గురించి కానీ.. కాశ్మీర్ అంశంలో కానీ కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడుతుంటే.. ఆ అంశంతో పాక్ కి సంబంధం లేదన్నట్లుగా మాత్రమే గత పాలకుల మాటలు ఉండేవి.
దానికి భిన్నంగా మోడీ సర్కారు నేతలు ఉండటం గమనార్హం. భారత్ తో జరిగిన యుద్ధంలో పాక్.. కాశ్మీర్ లోని కొంత భాగాన్ని అక్రమించుకోవటం.. దాన్ని విడిపించటంలో భారత్ విఫలం కావటం తెలిసిందే. యుద్ధంలో గెలిచి.. ప్రాంతాన్ని వదులుకున్న చిత్రమైన పరిస్థితి కాశ్మీర్ లో కనిపిస్తుంది.
తాజాగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాక్ అక్రమిత కాశ్మీర్ ను చేజిక్కించుకోవటమే భారత్ మొదటి లక్ష్యంగా చెప్పుకొచ్చారు. పాక్ తో యుద్ధం కాని చేస్తే భారీ మూల్యం చెల్లించాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జితేంద్రసింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడితే.. పాక్ అక్రమించిన కాశ్మీర్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి.. అసలు ఆ ప్రాంతమంతా తమదేనని తేల్చి చెబుతున్న దూకుడు విధానం ఎక్కడి వరకు తీసుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
దూకుడు మంచిదే కానీ.. కాశ్మీర్ అంశంలో ఇప్పటివరకూ అనుసరిస్తున్న గత పాలకుల వైఖరికి భిన్నంగా ఉండటం గమనార్హం. ఇక.. జమ్మూకాశ్మీర్ ఎన్నటికీ భారత్ అంతర్భాగమేనని తేల్చి చెప్పిన మంత్రి.. కాశ్మీర్ కు సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే.. అది పాక్ దురాక్రమణలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం తప్పించి మరొకటి కాదని తేల్చి చెబుతున్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేసుకోవటమే తమ ముందున్న లక్ష్యంగా చెబుతున్నారు. మంత్రిగారి మాటలు జాతీయవాదులకు చెవులూరించేలా ఉన్నా.. మాటల్లో కనిపిస్తున్న ఫోర్సు చేతల్లో ఉంటుందా? అది కూడా యుద్ధం లాంటివి చోటు చేసుకోకుండా అన్నదే పెద్ద ప్రశ్న. ఇంతకీ.. మంత్రిగారి మాటల్లో ఏమైనా మర్మం ఉందా?