భార‌త సైన్యానికి మ‌రో విజ‌యం... హిజ్బుల్ ఉగ్ర‌వాది హ‌తం

Update: 2020-05-18 04:00 GMT
ప్ర‌త్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో గ‌తంలో ఎప్పుడూ తుపాకుల తూట‌లు, కాల్పుల మోత‌లు ఉండేవి. వాటి నివార‌ణ‌తో పాటు భార‌త‌దేశాన్ని ఏకం చేయాల‌నే ఉద్దేశంతో భార‌త ప్ర‌భుత్వం జ‌మ్మూక‌శ్మీ‌ర్ ప్ర‌త్యేక చ‌ట్టాన్ని ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా మూడు ప్రాంతాలుగా విభజించిన విష‌యం తెలిసిందే. అయినా జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌రిస్థితి అదుపులోకి రాలేదు. వాగ్వాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు వంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇన్నాళ్లు త‌మ ఉనికి చాటుతూ జ‌మ్మూక‌శ్మీర్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్న కీల‌క నిందితుడిని భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. దీంతో భార‌త భద్రతా దళాలకు మరో విజయం దక్కింది.

జ‌మ్మూ క‌శ్మీర్‌ లోని దోడా జిల్లా ఖోత్రా గ్రామంలో సైన్యం స్థానిక పోలీసుల స‌హాయంతో దాడులు నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని భార‌త సైన్యాలు మట్టుబెట్టాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌కు ముందు ఐదు గంటల పాటు ఎన్‌కౌంటర్ పోరు సాగింది. చివ‌ర‌గా ఘటనా స్థలంలో ఆ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌ లో ఈ ఏడాది 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూను సైన్యం మట్టుబెట్టింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండ‌డంతో ఉగ్ర‌వాదులు త‌మ ఉనికి చాటేందుకు ఉవిళ్లూరుతున్నారు. ముందే అప్ర‌మ‌త్తంగా ఉన్న భార‌త సైన్యం వారిని అడ్డ‌గించి దేశంలో చొచ్చుకు వెళ్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ముందే అప్ర‌మ‌త్తంగా ఉన్న సైన్యం ఉగ్ర‌దాడుల‌ను తిప్పి కొడుతున్నారు. తాజాగా టార్గెట్ చేసిన ప్ర‌తిఒక్క‌రిని మ‌ట్టుపెట్టిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 2020లో 70మందికి పైగా ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ప్ర‌స్తుతం హిజ్బుల్ కీల‌కమైన వ్య‌క్తిగా భావిస్తున్న అహ్మ‌ద్ భ‌ట్‌ను కూడా ఎన్‌కౌంట‌ర్‌లో చంపేశారు.
Tags:    

Similar News