జేఎన్‌ యూ రగడ... రాష్ట్రపతి భవన్‌ కు పాకింది

Update: 2020-01-10 03:50 GMT
దిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల ర్యాలీతో రాష్ట్రపతి భవన్ వెలుపల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థుల నిరసన నేపథ్యం లో సెంట్రల్‌ ఢిల్లీలో 144 సెక్షన్‌ని విధించారు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ వద్ద పోలీసుల అదనపు బలగాలు మోహరించాయి. శాస్త్రి భవన్ హెచ్ఆర్డీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. జనవరి 5న జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి వీసీ జగదీశ్ కుమార్ కారణమని ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ నెల 5వ తేదీన వర్సిటీ లో  విద్యార్థులపై  దాడులకు వీసీ నిర్లక్ష్యమే కారణమని.. ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్తులు ర్యాలీతీశారు. ఈ ర్యాలీ శాస్త్రి భవన్ మీదుగా రాష్ట్రపతి భవన్ వరకు వెళ్లింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జేఎన్‌యూ నుంచి విద్యార్థులు ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వెళ్లుండగా.. అంబేద్కర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీసీ జగదీశ్‌ను తొలగించాలని విద్యార్థులు నినాదిస్తుండగా.. పోలీసులు అడ్డగించారు. వారిని అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్  పోలీసు స్టేషన్‌ కు తరలించారు. తర్వాత విద్యార్థులను విడుదల చేసినట్టు జేఎన్‌యూ విద్యార్థి విభాగం ట్వీట్ చేసింది. అంబేద్కర్ భవన్ వద్ద విద్యార్థులు భారీగా రావడం, పోలీసులు ఆగమనంతో హైటెన్షన్ నెలకొంది.


రహదారిపై ట్రాఫిక్ నిలిచి పోవడం తో  పోలీసులు తప్పుకోవాలని పదే పదే విద్యార్థులకు సూచించారు. లౌడ్ స్పీకర్‌లో చెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. పోలీసులు లాఠీ ఝులిపించడం తో ఓ విద్యార్థి తలకు గాయమైంది. విద్యార్థినులను సాయంత్రం 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో మహిళ పోలీసు లేరని ఆరోపించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీసీని పదవి నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News