బ్రాహ్మణికి నారా లోకేష్ సంక్రాంతి బహుమతి ఇదే!

అవును.. నేడు కనుమ పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు ప్రజానికం. ఈ సమయంలో తన భార్య నారా బ్రాహ్మణికి ఓ అపురూపమైన కానుక ఇచ్చారు నారా లోకేష్.

Update: 2025-01-15 05:37 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే భోగి, సంక్రాంతి పర్వదినాలను సంతోషంగా జరుపుకున్న ప్రజలు.. నేడు కనుమ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పసందైన వంటకాలను ఆరగిస్తున్నారు! స్నేహితులకు, బంధువులకు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణికి లోకేష్ ఓ కానుక ఇచ్చారు.

 

అవును.. నేడు కనుమ పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు ప్రజానికం. ఈ సమయంలో తన భార్య నారా బ్రాహ్మణికి ఓ అపురూపమైన కానుక ఇచ్చారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆ కానుక గురించిన విషయాలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఈ పోస్ట్ కు నారా బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. నెట్టింట ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా... తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాతి వేడుకల సందర్భంగా మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు లోకేష్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఆయన... ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి, చేనేతను ఆదుకోవాలని కోరారు.

ఈ సమయంలో ఎక్స్ లోని లోకేష్ పోస్టును బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉంది అని చెబుతూ లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చీరను తీసుకోవడం సంతోషానిచ్చిందని చెప్పారు.

ఇదే సమయంలో... తెలుగు ప్రజలకు కనుమ పండగ శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్. రైతన్నలు ఏడాది పొడవునా తమ కష్టంలో పాలుపంచుకునే పశువులను పూజించే పండుగ ఇది అని.. అన్నదాతల ఇల్లు ధాన్యరాశులతో నిండగా, పాడిపంటలతో పచ్చగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కనుమ.. అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు లోకేష్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News