అచ్చం అలానే రోహిత్ ఫ్రెండూ ఊరేసుకున్నాడు

Update: 2017-03-14 06:21 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య గురించి తెలిసిందే. అతడి మరణం ఎంత వివాదంగా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. తాజాగా రోహిత్ వేముల స్నేహితుడు.. ఢిల్లీ జేఎన్ యూలో  ఎంఫిల్ చేస్తున్న ముత్తుకృష్ణన్ సైతం అదే తీరులో ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. రోహిత్ వేముల.. ముత్తు కృష్ణన్ ఆత్మహత్యలు చేసుకున్నతీరు ఒకేలా ఉండటం గమనార్హం.

ఆత్మహత్య చేసుకున్న వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా చెబుతుననారు. అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కార్యకలాపాల్లో వీరిద్దరూ చురుగ్గా పాల్గొనేవారు. హైదరాబాద్ సెంట్రల్ యనివర్సిటీలో ఎంఏ చదివిన మృత్తు కృష్ణన్.. ఆ సమయంలో రోహిత్ వేములతో క్లోజ్ గా ఉండేవారు.ఇరువురి భావజాలం ఒకేలా ఉంటుందని చెబుతున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.

27ఏళ్ల ముత్తకృష్ణన్ సొంతూరు తమిళనాడులోని సేలం. ప్రస్తుతం జేఏఎన్ యూలో ఎంఫిల్ చేస్తున్న ఆయన.. కొందరు స్నేహితులతో కలిసి.. వర్సిటీకి పక్కనే ఉన్న మునిర్కాలో ఒక ఇంట్లో రెంట్ కి ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాత రూమ్ లో రెస్ట్ తీసుకునేందుకు రూమ్ కి వెళ్లి.. ఎంతకూ రాకపోవటంతో అతని స్నేహితులు వెళ్లితలుపు తట్టారు. ఎంతకూ తలుపు తీయకపోవటంతో.. అనుమానం వచ్చి చూడగా..రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న వైనం కనిపించింది.

రోహిత్ వేముల మాదిరి సీలింగ్  ఫ్యాన్ కు ఊరి వేసుకున్న ముత్తుకృష్ణన్ మరణం విద్యార్థుల్లో సంచలనంగా మారింది. సూసైడ్ ఎందుకు చేసుకున్నారన్న విషయం బయటకు రాలేదు. ఆత్మహత్య చేసుకున్న గదిలోనూ ఎలాంటి లేఖలు లభించలేదు. కాకుంటే..కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో వర్సిటీలోని వివక్ష గురించి ప్రస్తావించటం.. ఎంఫిల్ ఆద్మిషన్ల ప్రక్రియలోనూ.. వైవాలోనూ సమానత్వం లేదని ఆరోపించటం ఫేస్ బుక్ పోస్ట్ లో కనిపించింది. ఈఉదంతంపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News