కన్హయ్యకు 14 రోజుల కస్టడీ

Update: 2016-02-17 12:34 GMT
తన చర్యల ద్వారా దేశ వ్యాప్తంగా ఉద్రిక్తల్ని రేపిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు తాజాగా జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఉగ్రవాది అఫ్జల్ గురు వర్థంతి కార్యక్రమాన్ని వర్సిటీలో నిర్వహించటమే కాదు.. భారత్ ను ముక్కలు ముక్కలు చేస్తామన్న నినాదాలు చేసినట్లుగా చెబుతున్నారు.

దీంతో పాటు.. పాకిస్థాన్ జిందాబాద్ అనటం.. భారత్ నశించాలన్న నినాదాల్ని ఈ వర్థంతి సభలో పాల్గొన్న కొందరు విద్యార్థులు చేయటం గమనార్హం. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చగా మారటం.. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. కొందరు కమ్యూనిస్ట్ అగ్రనేతలు వర్థంతి సభకు మద్దుతుగా నిలవటం లాంటివి చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. కన్హయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని పాటియాలా కోర్టుకు సోమవారం విచారణకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అతనిపై దాడి జరిగింది. బుధవారం కన్హయ్య కేసు విచారణలో భాగంగా పాటియాలా కోర్టుకు తీసుకురావటం.. ఈ సందర్భంగా అతనిపై పలువురు దాడికి పాల్పడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ కేసును విచారించిన కోర్టు.. కన్హయ్య కుమార్ కు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మార్చి 2 వరకు ఈ విద్యార్థి సంఘ నాయకుడు జైల్లో గడపాల్సి ఉంటుంది.
Tags:    

Similar News