ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనడంపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు

Update: 2022-11-05 15:30 GMT
అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే ఎలన్ మస్క్ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను పంపే.. విషం చిమ్మే సోషల్ మీడియాను కొనుగోలు చేసాడని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు మనమందరం చింతించాల్సింది ఏంటంటే.. ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలు చెప్పే సోషల్ మీడియాను కొనుగోలు చేశాడు” అని శుక్రవారం చికాగోలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో బిడెన్ విమర్శలు గుప్పించారు.  

"ఇక ట్విట్టర్ ను కరెక్ట్ చేసే ఎడిటర్ లే ఉండరు" అని బిడెన్ ఆరోపించారు. " మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని.. ట్విట్టర్ మరింతగా భ్రష్టు పడుతుందని అర్థం చేసుకోవాలని" అంటూ బిడెన్ దుమ్మెత్తి పోశారు.

ఎలోన్ మస్క్ ఈ నెల ప్రారంభంలో ట్విటర్‌ను  $44 బిలియన్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. టెస్లా , SpaceX చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఎలన్ మస్క్ తాను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసి పూర్తి ప్రక్షాళన చేశాడు.  అందరినీ తీసేశాడు. రూల్స్ మార్చేశాడు. అనేక రకాల అపనమ్మకాలు సృష్టించాడు.విద్వేవం, హింసను ఆశ్రయించకుండా చర్యలు చేపడుతానని అంటున్నా ఎవరూ నమ్మడం లేదు..

ట్విట్టర్ స్పష్టంగా అందరికీ ఉచితం కాదంటూ బ్లూటిక్ వారి నుంచి వసూళ్లకు నిర్ణయించారు.  వివిధ దేశాల చట్టాలకు కట్టుబడి ఉండటంతో పాటు, మా ప్లాట్‌ఫారమ్ అందరికీ స్వేచ్ఛగా, స్వాగతించేదిగా ఉండాలని మస్క్ పిలుపునిచ్చాడు. మీకు కావలసిన అనుభవాన్ని ఎంచుకోవచ్చు" అని మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ఒక రోజు ముందు ట్వీట్ చేశాడు.

కొంతమంది వినియోగదారులు  యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎన్నికలతో సహా కుట్ర సిద్ధాంతాలను తిరిగి ప్రసారం చేయడం ప్రారంభించారు. తప్పుడు సమాచారంపై ట్విటర్ విధానాలను పరీక్షించే ప్రయత్నంలో ఇప్పటికీ ఫేక్ న్యూస్ కట్టడి చేయలేకపోతున్నారు.

యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి భర్త పాల్ పెలోసిపై దాడి గురించి కుట్ర సిద్ధాంతాన్ని ట్వీట్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ స్వయంగా నకిలీ వార్తల బాధితుడు అయ్యాడు. దీంతో ట్విట్టర్ అబద్ధాల పుట్టగా మారిందని జోబైడెన్ ఆరోపిస్తున్నాడు. మస్క్ కొనడంతో అది మరింత దిగజారుతుందని అంటున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News