జో బైడెన్ బృందంలో మరో భారత సంతతి మహిళ !

Update: 2021-05-15 04:33 GMT
అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ బృందంలో మ‌రో ఇండియ‌న్ అమెరిక‌న్ కి కీలక పదవి దక్కింది. అమెరికా అధినేతగా జో బిడెన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి బిడెన్ తన బృందం లో ఇండియన్స్ కి ప్రముఖ పాత్ర ఇస్తూ ఎన్నో కీలక పదవుల్లో  ఇండియ‌న్ అమెరిక‌న్స్ కి చోటు ఇచ్చారు. తాజాగా  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. అగ్రరాజ్య అధినేత జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియమితులయ్యారు.

ఈ విషయాన్ని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. జో బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ నియమితులయ్యారు. నీరా యొక్క తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బిడెన్ పరిపాలనకు ఒక ఆస్తి అవుతుంది’ అని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) వ్యవస్థాపకుడు జాన్ పొడెస్తా ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సెనెట్ ఆమోదం తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు. ఆమె హెల్త్‌కేర్, ఇంట‌ర్నెట్ యాక్సెస్ అంశాల‌పై ఆమె దృష్టిసారించ‌నున్నారు. సెంట‌ర్ ఫ‌ర్ అమెరిక‌న్ ప్రోగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్న టాండ‌న్‌.. గ‌తంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్‌కు స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. కాగా, అగ్రరాజ్యంలో బడ్జెట్‌ చీఫ్‌ గా నీరా టాండన్‌ నియామకంపై సెనెట్‌ తో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన అధ్య‌క్షుడు బైడెన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌ కు ఇది తొలి కేబినెట్‌ వైఫల్యంగా నిలిచింది. భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నియ‌మించాల‌ని బైడెన్‌ నిర్ణయించారు. అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అవి వివాదాస్పదమమ‌వ‌డంతో ఆమె నియామకాన్ని మంత్రులు, డెమొక్రాటిక్‌ చట్టసభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఆమె నియామకాన్ని ధ్రువీకరించేందుకు సెనెట్‌లో సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో నీరా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Tags:    

Similar News