అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చీరాగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హెచ్-1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు జో బైడెన్ శుభవార్త చెప్పారు. గతంలో హెచ్-4 వీసాదారుల పని అనుమతులను ట్రంప్ రద్దు చేశారు. ఈ ఆదేశాన్ని తాజాగా జో బైడెన్ సర్కార్ వెనక్కి తీసుకున్నది. హెచ్-బీ వీసాదారుల భాగస్వాములు కూడా ఇక పనులు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో లక్ష మంది భారతీయ వలసదారుల జీవిత భాగస్వాములకు ప్రయోజనం కలుగనున్నది.
సాధారణంగా హెచ్-1 బీ వీసాదారుల భార్యలు లేదా భర్తలకు హెచ్ - 4 వీసాలు అందజేస్తారు. అయితే వీరు కూడా ఏదైనా ఉద్యోగం చేసుకొనే వెసులు బాటు ఉండేది. కానీ ట్రంప్ సర్కార్ హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోకుండా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జో బైడెన్ ప్రభుత్వం ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది. చాలా మంది భారతీయులు అమెరికాలో హెచ్-4 వీసాలతోనే ఉన్నారు. అయితే వీళ్లు కూడా ప్రస్తుతం ఉద్యోగం చేసుకొనే అవకాశం కలిగింది.
డిసెంబరు 2017 నాటికి 84,360 మంది భారతీయ జీవిత భాగస్వాములు లబ్ధిపొందారు. ట్రంప్ అధికారంలోకి రాగానే వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దీనిపై పలువురు డెమొక్రటిక్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా ఉండే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఫిబ్రవరి 2019లో నాటి సెనెటర్.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమల హారిస్ కూడా ట్వీట్ చేశారు కూడా.