ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావం ఉండదు: ఏపీ మంత్రి హాట్ కామెంట్స్!

Update: 2022-10-04 21:24 GMT
కేసీఆర్ ఏర్పాటు చేసిన భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీకి అప్పుడే షాక్ త‌గిలింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ తేల్చిచెప్పారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంద‌న్నారు. ఏపీకి మ‌రో 25 ఏళ్ల‌పాటు సీఎంగా వైఎస్ జ‌గ‌నే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటారని.. వాళ్ళు ఆలోచనలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. మరో 20 ఏళ్ళ పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ వ‌చ్చినా వైఎస్సార్సీపీని ఏమీ చేయ‌లేద‌న్నారు. వైసీపీ ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోద‌ని తెలిపారు. ఏపీ ప్ర‌జ‌లంతా త‌మ వైపే ఉన్నార‌న్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక చేప‌ట్టినన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఎక్క‌డా చేప‌ట్ట‌లేద‌న్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్ర‌భావం త‌మ రాష్ట్రంలో ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

కొంత మంది టీఆర్ఎస్ మంత్రులు జ‌గ‌న్‌ గురించి మాట్లాడితే వాళ్ళ నాయకుడి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నారేమోనని మండిప‌డ్డారు. అందుకే వైఎస్ జ‌గ‌న్‌పై విమర్శలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అటు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్థానం ఉండ‌ద‌న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ రాజకీయంగా ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంద‌న్నారు. కేసీఆర్‌కు ఏపీలో రాజకీయంగా ఖాళీ లేద‌ని పేర్కొన్నారు. జాతీయ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్ప‌టికే న‌ష్ట‌పోయింద‌ని విష్ణు గుర్తు చేశారు. అందుకే ప్రజలు బలమైన ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News