'డెబ్రా క్రూ'.. పేరు కొత్తగా ఉండొచ్చు.. రాబోయే రోజుల్లో వార్తల్లో వ్యక్తిగా ఖాయం
డెబ్రా క్రూ.. ఎప్పుడూ విన్నది లేదే? ఇంతకూ ఈమె ఎవరు? ఏ రంగానికి చెందిన వారు? ఇప్పటివరకు ఎప్పుడూ ఈ పేరు వినలేదే? అంటూ ఈ పేరు గురించి చెప్పినంతనే చాలామంది చాలానే సందేహాలు కలగటం ఖాయం. నిజమే.. ఇప్పటివరకు ఈ పేరు చాలా పరిమితమైన వర్గాల్లో మాత్రమే తెలుసు. కానీ.. ఇక నుంచి ఆమె పేరు తరచూ వినిపించటమే కాదు.. ప్రపంచంలోనే అందరూ నిజమా? అనేంత ఒక అత్యున్నత స్థానాన్నిసొంతం చేసుకోనున్నారు. ఈ కారణంగానే ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? ఇంత ఇంట్రడక్షన్ అసవరమా? అనుకోవచ్చు. విషయం తెలిస్తే.. ఆ మాత్రం ఇవ్వటం తప్పేం కాదన్న భావన కలగటం ఖాయం.
ప్రపంచంలోనే అతి పెద్ద మద్యం తయారీ సంస్థ డియాజియో కంపెనీకి అధినేతగా వ్యవహరించనున్నారు డెబ్రా క్రూ. 52 ఏళ్ల ఈ అమెరికన్ మహిళ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. దీంతో.. ప్రపంచంలోనే అతి పెద్ద మద్యం తయారీ కంపెనీకి ఒక మహిళ సారథ్యం వహించే ఘనతను సొంతం చేసుకున్నారు. జానీ వాకర్ స్కాచ్ విస్కీ.. బెయిలీస్.. గిన్నిస్.. లాంటి ప్రముఖ బ్రాండ్లను ఈ సంస్థ తయారు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 28వేలకు మించిన ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ దాదాపు 200లకు పైగా బ్రాండ్లను అమ్ముతోంది. స్కాచ్.. విస్కీ.. వోడ్కా.. జిమ్.. రమ్.. లాంటి మద్యాల్నిఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
ఇక.. ఈ సంస్థకు సారథ్యం వహించనున్న క్రూ విషయానికి వస్తే.. ఆమె కొలరాడో వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.. ఆ తర్వాత వేరే విద్యా సంస్థ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. గతంలో పెప్సీ.. నెస్లే.. మార్స్ లాంటి ప్రముఖ సంస్థల్లో పని చేసింది. ఆ తర్వాత సిగిరెట్లను ఉత్పత్తి చేసే రేనాల్డ్స్అమెరికాకు సారథ్యం వహించారు. తాజాగా.. ప్రపంచంలోనే అత్యధిక మద్యాన్ని తయారుచేసే కంపెనీకి కొత్త బాస్ గా బాధ్యతల్ని చేపట్టనున్నారు. లిక్కర్ తాగి వచ్చే మొగళ్లను ఛీదరించే మహిళలు కోట్లాది మంది ఉంటారు. అలాంటిది ఒక మహిళే.. ప్రపంచంలోనే అతి పెద్ద లిక్కర్ సంస్థకు బాస్ కావటానికి మించిన విచిత్రం ఇంకేం ఉంటుంది?