అమెరికా కోర్టు ఇచ్చిన పరిహారం ఇప్పుడు ఆ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనకు క్యాన్సర్ సోకడానికి జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడరే కారణమంటూ వ్యాజ్యం దాఖలు చేసిన మహిళకు అమెరికాలోని మిస్సోరీ రాష్ర్టానికి చెందిన సెయింట్ లూయీ కోర్టు భారీస్థాయిలో 11 కోట్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించింది. భారత కరెన్సీలో అది రూ.737 కోట్లు. దీర్ఘకాలం ఆ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ ను వాడటం వల్లే తనకు అండాశయాల క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ లోయీ స్లెంప్ అనే మహిళ వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో భారీమొత్తంలో పరిహారం ఇప్పించడం సంచలనం సృష్టిస్తోంది.
జాన్సన్ బేబీ పౌడరుతో సహా కంపెనీ తయారు చేసే పలు టాల్కం ఉత్పత్తులపై సుమారు 2400 కేసులు నడుస్తున్నాయి. శాస్త్రపరమైన ఆధారాలను లెక్క చేయకుండా ఈ కంపెనీలు అమెరికా మహిళల పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తూనే ఉన్నాయని ఈ కేసు రుజువుచేస్తున్నదని స్లెంప్ తరఫు న్యాయవాది టెడ్ మీడోస్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ తీర్పుపై అధ్యయనం చేస్తున్నట్లు జాన్సన్ కంపెనీ వెల్లడించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/