క్రికెట్ లో చిన్న చిన్న గొడవలు జరగడం సర్వసాధారణమైన విషయంగా మారిపోతుంది. అసలు క్రికెట్ లో స్లెడ్జింగ్ మంచిదా కాదా అనే చర్చలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాస్త ముందుంటారు అనే విమర్శా ఉంది. ఇదే సమయంలో స్లెడ్జింగ్ కూడా ఆటలో భాగమే అని రీకీపాటింగ్ వంటి క్రికెటర్లు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఆ స్లెడ్జింగ్ గురించే రకరకాల చర్చలు జరుగుతుంటే... ఈ మధ్యకాలంలో క్రికెటర్లు ముఖ్యంగా యువక్రికెటర్లు వ్యక్తిగత దూషణలకు - వాగ్వాదాలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుంది! అప్పట్లో ఆడ్రూ సైమండ్స్ - హర్భజన్ - గంభీర్ - అఫ్రీదీ ల మధ్య మాటల యుద్దాలు కూడా వరల్డ్ ఫేమస్! అయితే తాజాగా ఇంగ్లాడ్ - బంగ్లాదేశ్ క్రికెటర్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. ఆటలో మొదలైన ఆ వాగ్వాదం, ఆట పూర్తైన తర్వాత ప్రజెంటేషన్ సమయంలో కూడా జరగడం గమనార్హం.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ - ఇంగ్లండ్ క్రికెటర్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అవుటైన క్రమంలో బంగ్లా బౌలర్ ల ఓవర్ యాక్షన్ కూడా తోడవడంతో ఈ వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారినంత పనైంది. బంగ్లా బౌలర్ తస్కిన్ బౌలింగ్ లో జాస్ బట్లర్ ఎల్బీగా అవుట్ కావడమే ఈ గొడవకు ప్రధాన కారణం. తస్కిన్ బౌలింగ్ లో తొలుత బట్లర్ అవుటంటూ బంగ్లా ఆటగాళ్ల చేసిన అప్పీల్ ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించి నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ రివ్యూ కోరింది. అయితే రివ్యూలో బట్లర్ ఎల్పీడబ్యూగా అవుటైనట్లు ప్రకటించడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆనందంలో తేలిపోయారు. ఇదే సమయంలో బట్లర్ వైపు వేలుచూపిస్తూ పెవిలియన్ కు దారి చూపెడుతూ కొంతమంది బంగ్లా ఆటగాళ్లు సైగలు చేశారు. దీంతో బట్లర్ తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదం మొదలైంది. ఒక దశలో బట్లర్ ను నిలువరించడానికి ఫీల్డ్ అంపైర్లు సైతం శ్రమించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అయితే అంపైర్ల జోక్యంతో అప్పటికి వారి మధ్య చోటు చోసుకున్న రగడ ముగిసినా... మ్యాచ్ అనంతరం కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించిన తరువాత ఆటగాళ్లను అభినందించే కార్యక్రమంలో కూడా బంగ్లా ఆటగాడు తమీమ్ తో ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గొడవకు దిగేంత పని చేశాడు. కాగా, సహచర ఆటగాళ్లు అక్కడ ఉండటంతో వారు మాటలతోనే తమ ఆవేశాన్ని చూపించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ 57 పరుగులు సాధించగా, బంగ్లానే విజయం వరించింది. అయితే... మైదానంలో ఈ వివాదంపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విచారణ జరిపిన అనంతరం క్రికెటర్లపై చర్యలు తీసుకోనున్నాడు.
Full View