ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ అఫ్గాన్ తాలిబన్ల వశం కావటం తెలిసిందే. అక్కడక్కడా కొంత ప్రతిఘటన ఎదురవుతున్న వేళ.. పూర్తిస్థాయి అధికారాన్ని మాత్రం ఇంకా చేపట్టలేదు. కాబూల్ కు చేరుకునే లోపు అఫ్గాన్ అధ్యక్షులు వారు పారిపోవటం.. ఉపాధ్యక్షుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవటం తెలిసిందే. ఎలాంటి రక్తపాతం చోటు చేసుకోకుండానే కాబూల్ సొంతం కావటం.. అఫ్గాన్ తమ వశమైందన్న మాట తాలిబన్ల నోటి నుంచి రావటం తెలిసిందే. తాము పూర్తిగా మారిపోయామని.. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని పేర్కొన్నారు.
మాటల్లో మార్పు వచ్చినా.. చేతల్లో మాత్రం ఇంకా అలాంటిదేమీ లేదన్న విషయం వారు ఇప్పటికే చేసి చూపించారు. బ్యూటీపార్లర్ల బయట పెట్టిన మహిళల ఫోటోలకు నల్ల ఇంకు పూసేయటం.. తమకు అనుకూలంగా లేని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయటం లాంటివి చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వేళ. .తాలిబన్ల నుంచి తప్పించుకోవటానికి పలువురు కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. అలా వెళ్లి.. మొన్నటి విమానంలో తప్పించుకు వెళ్లిన కొందరిలో ఒక అఫ్గాన్ జర్నలిస్టు ఉన్నారు. అతడి పేరు రామిన్ రహమాన్. తాలిబన్ల చెర నుంచి తాను ఎలా తప్పించుకున్నానన్న విషయాన్ని సదరు జర్నలిస్టు ఓపెన్ అయ్యారు.
తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న తాను ఎలా తప్పించుకున్నది? ఎప్పుడు తప్పించుకున్నది? లాంటి వివరాల్ని వెల్లడించారు. తాలిబన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్న రోజున కర్జాయ్ విమానాశ్రయం నుంచి తానెలా తప్పించుకున్నది వెల్లడించారు. అతగాడి భయంకర అనుభవం ఇలా ఉంది.
‘అది కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. రన్ వేపై వేలాది మంది భయంతో సహాయం కోసం వేడుకుంటున్నారు... గన్ కాల్పుల మోతలు భయంకరంగా వినిపిస్తున్నాయి. కాల్పులతో ఆకాశం వెలుగులు జిమ్ముతోంది. ఎయిర్ పోర్టుకు వచ్చేసరికి అక్కడ వేలాది మంది ఉన్నారు. తాలిబన్ల రాక వారి అందరి ముఖాల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రన్ వే మీద విమానం ఉంది. కానీ.. దాన్ని నడిపేందుకు పైలెట్ లేడు’
‘అఫ్గాన్ కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ యాజమాన్యంలో పని చేసే ఒక విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ విమానంలోకి అప్పటికే వెయ్యి మంది ప్రయాణికులు ఎక్కారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు దూకుతున్నారు. కొందరు విమానం మెట్ల మీద వేలాడుతున్నారు. ఆ రద్దీగా ఉన్న విమానం మొత్తం రాజకీయ నేతలతో నిండిపోయింది. అక్కడి గార్డులు ప్రజల్ని విమానం మెట్ల మీద నుంచి కిందకు నెట్టేశారు. దీంతో ఫ్లైట్ టేకాప్ తీసుకుంటుందని భావించా’
‘అంతలో కాల్పుల శబ్దం వినిపించింది. ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయపడ్డారు. ఆ సమయంలో నేను జర్మనీలో ఉన్న నా స్నేహితుడితో మాట్లాడాను. ఆ తర్వాతి రోజు జర్మన్ల తరలింపు మొదలవుతుందని చెప్పాడు. ఎయిర్ పోర్టు మొదటి గేటు వెలుపల కాల్పుల శబ్ధం మరింత ఎక్కువైంది. ఆ టైంలో అమెరికన్ సైనిక దళాలు తార్మక్ సైనిక విభాగంలోకి కొందరిని తీసుకెళ్లటం చూశాను’
‘ఇక్కడకు తాలిబన్లు ఇక్కడకు రారన్నమాటను సైనికుల్లో ఒకరు విదేశీయుల బృందంతో చెప్పడం విన్నా. కాల్పుల వేళ మిగిలిన వారితో పాటు నేను కూడా అమెరికా సైనికులతో కలిసి పరిగెత్తా. వందలాది మందితో కలిసి విమానంలోకి ఎక్కా. కానీ..అక్కడ కూర్చోవటానికి స్థలం లేదు. అందుకే నిలబడ్డా. చాలామంది తల్లులు తమ పిల్లల్ని పట్టుకొని నిలబడ్డారు. శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా ఉంది. విమానం మొత్తం వెయ్యి మంది ఉండటంతో కాలు కదిపే వీల్లేని పరిస్థితి ఉంది’
‘కాసేపటికి విమానం రన్ వే మీద బయలుదేరింది. అప్పటివరకు ఎంతో టెన్షన్ తో ఉన్న మా అందరికి రిలీఫ్ గా మారింది. టేకాఫ్ తీసుకునే వరకు టెన్షన్ పడుతూనే ఉన్నాం. నెమ్మది మొదలైన విమాన ప్రయాణం.. ఎప్పటిలానే వేగంగా పరుగులు తీసి.. తన శక్తి మొత్తాన్ని ప్రయోగించి గాల్లోకి ఎగిరింది. ఆ క్షణం వరకు ప్రాణభయంతో టెన్షన్ పడుతున్న వారంతా ఒక్కసారిగా రిలీఫ్ అయ్యారు. అందరం చప్పట్లు కొట్టాం. విమానం బయట కాల్పుల శబ్దం వినిపిస్తోంది. అఫ్గాన్ నుంచి బయటపడటం.. ఆ రోజున ఎంత సంతోషించాను. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. బహుశా ఆ విమానం రాకుంటే.. మేమంతా చనిపోయేవాళ్లం. తాలిబన్ల బారి నుంచి బయటపడినందుకు అక్కడున్న వారంతా ఎంతో ఆనందానికి గురయ్యారు’ అంటూ తన అనుభవాన్ని కళ్లకు కట్టినట్లుగా వెల్లడించాడు.