ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆ రాష్ట్రంలోని మీడియా మిత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంటల తరబడి నిరీక్షణలో ఉంచడం ద్వారా ఇప్పటికే మీడియా మిత్రులకు గంటా అనేక సందర్భాల్లో చుక్కలు చూపించారు. తాజాగా ఓ అడుగు ముందుకు వేసి మూడు రోజుల ముందే ప్రకటించిన కార్యక్రమాన్ని రద్దుచేసుకొని గంటల తరబడి వేచి చూస్తున్న విలేకరులకు షాక్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే పోటీ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా తిరుపతిలో విడుదల చేస్తారని మూడు రోజుల ముందే ప్రకటించారు. బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీలోని సవేరా అతిథిగృహంలో ప్రెస్ మీట్ అని సమాచారం ఇచ్చారు. అయితే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబుతో పాటు గంటా వెళ్లిపోయారు. దీంతో షెడ్యూల్ మార్చి 11 గంటలకు ఉంటుందని చెప్పారు. ఇక్కడా మళ్లీ గంటా మార్కు షాక్ ఇస్తూ....మంత్రిగారు మహిళా కాంగ్రెస్ ప్రారంభానికి వెళ్లిపోయారు. ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పద్మావతి అతిథిగృహంలో షెడ్యూల్ విడుదల చేస్తారని చెప్పడంతో మళ్లీ మీడియా హడావిడి ప్రారంభమయ్యింది. అయితే విజయవాడ వెళ్లడానికి విమానాశ్రయానికి వెళ్లిపోవాలని, సమయంలేదని చెప్పేసి మంత్రి చల్లగా వెళ్లిపోయారు. 'మరికొద్ది సేపట్లో మంత్రిగారి ప్రెస్ మీట్' అంటూ మీడియాను రెండు రోజుల పాటు ఉరుకులు పరుగులు పెట్టించి... ఒకే రోజు మూడు సమయాలు ప్రకటించిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టకనే విజయవాడకు పయనమయిన గంటా తీరుపై పాత్రికేయ మిత్రులు సహజంగానే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/