ఒకప్పుడు జర్నలిస్టు అంటే సమాజంలో ఓ విలువ ఉండేది. చాలామంది జర్నలిస్టులు వారి రాతలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. పాతతరం జర్నలిజానికి నేటి జర్నలిజానికి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు జర్నలిస్టు ప్రజా సమస్యలపై తన రాతలతో ప్రజలను చైతన్యం నింపేవాడు. నేడు జర్నలిస్టులు యాజమాన్యం ఏది చెబితే అదే వార్త.. అదే రాయాలి.. లేకపోతే కొలువు ఉండదు. అంతేకాదు జర్నలిస్టులకు ప్రత్యేకమైన టార్గెట్ ఫిక్స్ చేస్తుంది యాజమాన్యం. నేటి పోటీ ప్రపంచంలో కొలువు దక్కుంచుకోవడం ఒక ఎత్తయితే దానికి కాపాడుకోవడం మరో ఎత్తవుతుంది. ఈ కోవాలోకి జర్నలిస్టులు ఏనాడో చేరిపోయారు. యాజమాన్యం పెట్టే వచ్చి రాని షరతులు, టార్గెట్లకు తల ఊపుతూ ఒత్తిడితో జయించలేక అర్థాంతరంగా ప్రాణాలను తీసుకుంటున్నారు.
*బతకలేక జర్నలిస్టు
ప్రస్తుతం జర్నలిస్టుల జీవితాలు నడిసంద్రంలో నావలా మారాయి. బతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి సామెత.. ఇప్పుడు దాన్ని ‘బతకలేక జర్నలిస్టు’ అని మార్చుకోవాలేమో.. కంపెనీలను జీతాలు పెంచమంటే.. ఆర్థికమాంద్యం, నష్టాలు కారణంగా చెబుతుంటారు. అదే మీడియా యాజమాన్యాలు సంస్థ నంబర్ 1కు చేరుకున్నప్పుడు.. లాభాల్లో ఉన్నప్పుడు వాటిని జర్నలిస్టులకు ఎందుకు పంచరు.? నష్టాల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఆ భారాన్ని జర్నలిస్టులపై ఎందుకు మోపుతారన్నది ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఎటూ వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా జర్నలిజం వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్లు వేరే రంగంలోకి వెళ్లలేని పరిస్థితి. ఒక్కసారి జర్నలిజం అనే ఊబిలో దిగాక బయటికి రావడం అనేది ఉండదు. వచ్చిన బ్రతికి బయటపడుతారన్న గ్యారెంటీ ఉండదు అన్న నానుడి జర్నలిజంలో ఉంది. చాలిచాలనీ జీవితాలతో జర్నలిస్టుల వృత్తిలో కొనసాగుతున్న వాళ్లు అనేకమంది ఉన్నారు. ఓ యాజమాన్యం విధించే టార్గెట్లతో ఒత్తిడి జీవితాలను గడుపుతున్న వారికి కుటుంబ సమస్యలు తోడవుతున్నాయి. ఈ పరిణామాలతో జర్నలిస్టులు బీపీ, షుగర్, గుండెజబ్బులకు లోనవుతూ అర్థాంతరంగా ప్రాణాలను విడుస్తున్నారు.
*జర్నలిస్టు చావు దేనికి సంకేతం?
తాజాగా ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనతో మరోసారి జర్నలిస్టు సమస్యలపై చర్చ మొదలైంది. ప్రభాకర్ జర్నలిస్టుగా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. తొలినాళ్లలో ప్రింట్ మీడియాలో సబ్ ఎడిటర్ గా కొనసాగిన ఆయన ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జర్నలిజంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయనపై ఒత్తిడి తీవ్రమైనల్లు తెలుస్తోంది. కుటుంబంలోని కష్టాలను ఎలా తీర్చాలో తెలియక మనస్థాపంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య ఘటనతో జర్నలిస్టు అందరిలో విషాదచాయలు నెలకొన్నాయి.
* ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు అడగొద్దు..
గత కొన్నాళ్లుగా జర్నలిస్టుల జీవితాలు అధ్వానంగా మారాయి. ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు లేక చాలా ఒత్తిళ్ల మధ్య జర్నలిస్టులు జీవితాలు వెళ్లదీస్తున్నారు. జీతాలు పెంచక రెండుమూడేళ్లు అవుతోంది. పెంచినా అవి 1000లోపే.. 5నుంచి 10శాతం అంటూ అందులోనూ కొసరులు.. కట్ లు.. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేసే జర్నలిస్టు మిత్రులు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుంగిపోతున్నారు. ప్రభుత్వానికి, యాజమాన్యాలకు జర్నలిస్టుల సమస్యలు పట్టించుకున్న పాపానా పోలేదు. అయితే నిజమైన జర్నలిస్టులు పేదరికంలో కొట్టుమిట్టాడుతుండగా కొందరు నకిలీ జర్నలిస్టులు మాత్రం దందాలు చేస్తూ సంపాందించుకుంటున్నారు. కొందరు మాఫియా జర్నలిస్టుల వల్ల సమాజంలో నిజమైన జర్నలిస్టుకు చెడ్డపేరు వస్తోంది.
*జర్నలిస్టుల జీవితాలు మారేదెన్నడు?
ఏదిఏమైనా ప్రస్తుతం జర్నలిజంలో విలువలు పతనమవడంతోపాటు వారి జీవితాలు దుర్భరంగా మారాయనేది కఠొర సత్యం. జర్నలిజంలోకి వచ్చి ఏదో సాధించాలని కలలు కంటున్న ఎంతోమంది అందులో చేరాక ఏమీ లేదన్న వాస్తవాన్ని తొందరలోనే గుర్తిస్తున్నారు. బయటపడే మార్గం కానరాక ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతుండటం శోచనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులు మున్ముందు కొనసాగితే జర్నలిస్టు అనేవాడు కనుమరుగు అవడం ఖాయంగా కన్పిస్తోంది. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ అనే జర్నలిస్టుకు కన్నీటితో ఘాటుగా జర్నలిస్టులు మంచి పదప్రయోగాలతో నివాళులర్పించడం తప్పితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రస్తుతం ఏర్పడింది.