జూనియర్ ని టీడీపీని కలపనున్న ఎన్టీయార్... ?

Update: 2022-02-20 16:30 GMT
టీడీపీకి ఈ ఏడాది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ పుట్టి నాలుగు పదులు నిండుతాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక చిన్న గదిలో 1982 మార్చి 29న  కేవలం నలభై మంది మాత్రమే కూర్చున్న అతి చిన్న గదిలో  సమావేశంలో పెట్టి పుట్టిన  పార్టీ నాలుగు దశాబ్దాలుగా జెండా ఎగరవేయడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. ఇక జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం ఇపుడు కాసింత వెనక్కు తగ్గినా అది ముందుకు జోరుగా సాగేందుకే అని అంటున్నారు.

ఇక ఈ ఏడాది టీడీపీకి ఆ విధంగా ఫార్టీ ఇయర్స్ పార్టీ సెలబ్రేషన్స్ ఒక పెద్ద కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. ఆ తరువాత చూసుకుంటే ఇదే ఏడాది మే 28న నందమూరి నట సారభౌముడు రాజకీయ దురంధరుడు ఎన్టీయార్ శత జయంతి వేడుకలు మొదలు కానున్నాయి. అంటే ఇది టీడీపీకి అతి పెద్ద పండుగ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా రెండు ఈవెంట్స్ ని బ్రహ్మాండంగా నిర్వహించడానికి టీడీపీ సిద్ధపడుతోంది. ఈ ఊపుతోనే ఏపీలో టీడీపీ నావను దూసుకుపోయేలా చేఅయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఈ మొత్తం కార్య‌క్రమంలో  నందమూరి టోటల్ ఫ్యామిలీ పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరూ ఎక్కడా మిస్ కాకుండా చూడాలని కూడా అనుకుంటోంది.

ఈ ఏడాది మార్చి 29న తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవం. దాంతో హైదరాబాద్ గండిపేట వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమంతో టీడీపీ జోరు స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత మే 27,28, 29 తేదీలలో మహానాడును కూడా ఏపీలో సరైన వేదిక‌ చూసి మరీ  ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. టీడీపీ మహానాడు 2018 తరువాత నిర్వహించలేదు. 2019లో ఘోర పరాజయం తరువాత పార్టీ సైలెంట్ అయింది. 20, 21లలో కరోనా వల్ల జూమ్ మీటింగులకే పరిమితం అయ్యారు.

ఈసారి కరోనా బెడద‌ లేకపోవడంతో గ్రాండ్ లెవెల్ లో మహానాడు ఉంటుంది అంటున్నారు. ఈ మహానాడులో బాలయ్య ఎటూ పాలుపంచుకుంటారు. అలాగే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్తీయార్ ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. దానికి కారణం ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలు కావడమే. తారకరాముడి నూరవ పుట్టిన రోజు వేడుక వేళ యావత్తు కుటుంబం అంతా ఉండాలన్నది ఒక ఆలోచన.

దీని వెనక టీడీపీ అధినాయకత్వం భారీ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీయార్ బ్లడ్ ని అంతా ఒకే వేదిక మీదకు తేవడం ద్వారా తామంతా ఒక్కటే అన్న నినాదాన్ని క్యాడర్ కి ఇవ్వడంతో పాటు పార్టీకి జోష్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక జూనియర్ కనుక మహానాడుకు హాజరైతే టీడీపీకి శుభారంభం అయినట్లే.

జూనియర్ ఒక్కడు చాలు టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీకి ఇంధనంలా ఉపయోగపడతారు అని అంటున్నారు. ఇక శతజయంతి ఉత్సవాలతో మొదలుపెట్టి ఏడాది అంతా కూడా అన్న గారి పేరిట ఏపీ మొత్తం అంతటా జయంతి వేడుకలను ఒక జాతరలా సంబరంగా నిర్వహించాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్.  అంటే 2023 మహానాడుకి టీడీపీ ఫుల్ రీచార్జి అయ్యేలా ఈ మొత్తం వ్యవహారం అంతా ఉంటుంది అంటున్నారు. మొత్తానికి అన్న గారే దిగి వచ్చి తన కుటుంబం మొత్తాన్ని టీడీపీ నీడకు చేర్చడం ద్వారా మరో సారి తెలుగు కాంతులు ఏపీ అంతటా వికసించేలా చేస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
Tags:    

Similar News