దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నా పశ్చిమబెంగాల్ రూట్ సపరేట్ అన్నట్లు ఉంటుంది. అక్కడ అధికారపార్టీకి చెందిన నేతలకు.. విపక్షాలకు చెందిన నేతలకు మధ్య విభజన రేఖ వేరుగా ఉంటుంది. ఇదంతా ఇక్కడి వరకే పరిమితం కాదు.రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు సైతం తరచూ ఇబ్బందులకు గురి అవుతుంటారు. తాజాగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ వరుసగా రెండోరోజు చేదు అనుభవం ఎదురైంది.
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారు ఎవరైనా సరే.. గవర్నర్ విషయానికి వస్తే ప్రోటోకాల్ లో పొల్లు తేడా రాకుండా చూసుకుంటారు. గవర్నర్ తీరు ఎలా ఉన్నా.. రాజ్ భవన్ తో పెట్టుకోవటానికి ఇష్టపడరు. కానీ.. బెంగాల్ లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితిగా చెప్పక తప్పదు.
పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్సిటీ వార్షిక స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన గవర్నర్ కు చేదు అనుభవం ఎదురైంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన్ను అడ్డుకోవటమే కాదు.. ఆయన కారునుచుట్టుముట్టి నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
అంతేనా.. సీఏఏకు అనుకూలంగా మాట్లాడుతున్న గవర్నర్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకునేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పి షాకిచ్చారు. వర్సిటీకి వెళ్లిన ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్న ఆందోళనకారుల్ని పక్కకు తీసేందుకు వర్సిటీ యంత్రాంగం ఎలాంటి ప్రయత్నం చేయకపోవటంపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
తాను విద్యార్థుల మధ్య చిక్కుకున్నప్పటికీ వీసీ కానీ.. వర్సిటీ సిబ్బంది కానీ తనను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదని.. అదే సమయంలో మీడియాకు బైట్లు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేదు అనుభవం ఈ రోజు మాత్రమే కాదు.. సోమవారం కూడా గవర్నర్ కు ఎదురైంది.
స్నాతకోత్సవం గురించి వర్సిటీ అధికారులతో మాట్లాడేందుకు వచ్చిన ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు. అనుకుంటాం కానీ.. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం కర్కశంగా వ్యవహరిస్తుందంటే.. ఇలాంటి వాటిని ఎవరు మాత్రం స్వాగతిస్తారు. అయితే..ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. కీలక స్థానాల్లో ఉన్న వారు ఎవరికి వారు వారి.. వారి లక్ష్మణ రేఖల్ని దాటేందుకు మొహమాటపడని వేళ.. ఇలాంటివే చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.