పెను సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతానికి సంబంధించి వెలుగు చూస్తున్న విషయాలు ఇప్పుడు షాకుల మీద షాకులుగా మారుతున్నాయి. నిండా పద్దెనిమిదేళ్లు లేని మైనర్లు.. మరో మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. ఈ సందర్భంగా వారు వ్యవహరించిన తీరు విస్తుపోయేలా ఉందని చెబుతున్నారు.
మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒకరు మేజర్ కాగా.. మిగిలిన ఐదుగురు మైనర్లు అన్న విషయం తెలిసిందే. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని వేర్వేరుగా విచారించటం.. పలు ప్రశ్నలతో వారి నుంచి అసలేం జరిగిందన్న అంశాల్ని రాబట్టే ప్రయత్నం చేయటం తెలిసిందే.
కస్టడీలో జరిపిన విచారణలో నిందితుల నోటి నుంచి వచ్చిన ఒక అంశం పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా చేసిందంటున్నారు. గ్యాంగ్ రేప్ జరిపే వేళలో.. బాధితురాలి ఒంటిపై గాయాలు తీవ్రంగా ఉంటే.. తాము ఇరుక్కుంటామన్న ఉద్దేశంతో.. చాలా జాగ్రత్తగా ఎలాంటి గాయాలు కాకుండా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఇంటర్నెట్ లో పలు వీడియోల్ని శోధించి మరీ వారు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పంటితో గాట్లు.. గోళ్లతో రక్కటం లాంటివి చేయకూడదనుకున్నట్లు సమాచారం. వారు అనుకున్నట్లే జాగ్రత్తలు తీసుకున్నా.. మెడ వెనుక మాత్రం గోళ్ల గాట్లు పడటం తెలిసిందే. బేకరీలో పేస్ట్రీ తిందామని చెప్పి తీసుకొచ్చిన వారు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడగా.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా తెలుస్తోంది.
ఆ సందర్భంగా గోళ్లతో రక్కినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కస్టడీలో ఉన్న నిందితులు నేరాల్ని ఒకరిపై మరొకరు వేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. వారు వెల్లడించిన వివరాలకు సంబంధించి ఆధారాల్ని సిద్ధం చేస్తున్న పోలీసులు నేరాన్ని నిరూపించేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ కేసులో ఇన్నోవా వాహనం కీలకమని పోలీసులు చెబుతున్నారు. అత్యాచారం జరిగిన వేళ.. తమకు అంటిన మరకల్ని తుడుచుకునేందుకు టిష్యూ పేపర్లను వినియోగించిన నిందితులు.. వాటిలోకొన్నికారులోనే పడేసినట్లు చెబుతున్నారు. వీటిని పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. చిన్న వయసులోనే ఇంతటి విపరీతమైన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.