పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా తమకి తమ బంధువుల నుండి ప్రాణహాని ఉందని వారి నుంచి భద్రత కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఓ కొత్త జంట.ఇందుకోసం ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎవరూ ఊహించని విధంగా వారికి రూ. 10 వేలు జరిమానా వేశారు. అదేంటి పెళ్లి చేసుకున్నాం ..రక్షణ కల్పించడండి అంటే 10 వేలు ఫైన్ ఎందుకు వేశారు అని ఆలోచిస్తున్నారా?
ఆ కొత్త జంటకి జడ్జి జరిమానా వేయడం వెనుక అసలు కారణం ఇంకొకటి ఉంది. ప్రస్తుతం వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ , భౌతికదురం తప్పనిసరి. అయితే, పెళ్లి చేసుకున్న సమయంలో ఆ ఇద్దరూ మాస్కులు ధరించలేదనే కారణంగా జడ్జి వారికి రూ. 10 వేలు ఫైన్ వేశారు. వారి పెళ్లి ఫోటోలను పరిశీలించిన జడ్జి ఆ ఫోటోల్లో వారిద్దరూ మాస్కులు పెట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
వైరస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ... కొత్త జంట పాటించలేదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఈ కారణంగానే వారికి రూ. 10 వేలు జరిమానా వేశారు. హోషియార్ పూర్ డీసీలో ఈ మొత్తాన్ని 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని, ఈ మొత్తాన్ని అక్కడి ప్రజలకు మాస్కులు సమకూర్చడం కోసం ఖర్చు చేయాలని ఆదేశించారు. అనంతరం కొత్త జంటకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని గురుదాస్ పూర్ ఎస్ పి కి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.