రాజకీయ ఫిరాయింపుదార్లను సహించేది లేదని మరోసారి జనం తేల్చి చెప్పారు. ఏపీలో ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిన సంగతితెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలను కొనుక్కెళ్లారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. అయితే వారిలో కొందరికి ఆయన టికెట్లు కూడా ఇవ్వలేదు. కొందరికి ఇచ్చారు.అయితే వారందరినీ ప్రజలు ఓడించారు.
రాజకీయ ఫిరాయింపుకు పాల్పడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఓటమి పాలయ్యారు. అదీ పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరగడం విశేషం. మహారాష్ట్రలో కూడా గత ఐదేళ్లలో అనేక మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఎన్సీపీ నుంచి - కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు శివసేన - బీజేపీల్లోకి చేరారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారందరికీ ఓటమి తప్పలేదు.
ఎన్సీపి నుంచి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వారిలో పదకొండు మంది బీజేపీలోకి మరో ఎనిమిది మంది శివసేనలోకి చేరారు. వారందరికీ దాదాపుగా టికెట్లు లభించాయి. అయితే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు.
వారిపై భారీ మెజారిటీలతో ప్రత్యర్థులు విజయం సాధించారు. తద్వారా ఎమ్మెల్యేల ఫిరాయింపులను సహించేది లేదని ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. ఇలాంటి తీర్పులను గమనించి.. రాజకీయ నేతలు అనైతిక ఫిరాయింపులకు పాల్పడేముందు ఇక నుంచి ఆలోచించుకోవాలి. లేకపోతే వారి కెరీర్ లకే శుభం కార్డు పడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.