ఏపీలో కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. విధులు బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే సమ్మె సరైన్ మోగించిన జూడాలు ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఈ ఉదయం నుంచి జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె లోకి దిగారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమకు కరోనా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్ లో టీడీఎస్ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమ్మెలో భాగంగా నేడు కరోనాతో సంబంధం లేని విధులు, 10వ తేదీన కొవిడ్ విధులు, 12 వతేదీన కరోనా వైరస్ అత్యవసర విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు రెసిడెంట్ స్పెషలిస్టులకు ఏపీ సర్కారు నిన్ననే శుభవార్త చెప్పింది. వారందరికీ గౌరవ వేతనాన్ని పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి జూనియర్ డాక్టర్లకు ఈ సదుపాయాలు అన్నీ కల్పించడంతో ఏపీలోనూ వైద్యవిద్యార్ధులు తమకూ వీటిని అందించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించే పరిస్ధితి లేకపోవడంతో సమ్మెకి దిగారు. తెలంగాణలోనూ సమ్మె నోటీసు తర్వాతే కేసీఆర్ సర్కారు జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చడం విశేషం.