ప్రజా ప్రతినిధులు శృతి మించి పోతున్నాయనేందుకు ఇదో నిదర్శనం. గేటు ముందు నిలిపి ఉంచిన కారును పక్కకు తీయించడమే ఆ ఉద్యోగి చేసిన నేరమైంది. ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఉద్యోగి అతడి కాళ్లు పట్టుకొని, క్షమాపణలు తెలిపాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకెళ్తే జిల్లాలో ఉన్న డెవలప్ మెంట్ బ్లాక్ లో జయంత్ దాస్ జూనియర్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా రహా నియోజవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే దింబేశ్వర్ దాస్ గురువారం డెవలప్ మెంట్ బ్లాక్ కు వెళ్లారు. కాగా దింబేశ్వర్ కారును గేటు ముందు నిలిపి ఉంచడంతో పక్కకు తీయాల్సిందిగా డ్రైవర్ ను జయంత్ దాస్ కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. డ్రైవర్ అంతటితో ఆగకుండా విషయాన్ని ఎమ్మెల్యే దింబేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోపోద్రిక్తుడైన దింబేశ్వర్.. జయంత్‌దాస్‌ను పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జయంత్.. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని క్షమాపణ తెలిపాడు. అక్కడే ఉన్న మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరించింది. మరోవైపు ఘటనతో బిజెపి అసలు రూపం బయట పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత దేబబ్రతా సైకియా విమర్శించారు. కాగా ఈ వ్యవహారంపై సదరు బిజెపి ఎమ్మెల్యేకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు అందించింది. దింబేశ్వర్ నుంచి వివరణ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని బిజెపి అస్సాం చీఫ్ రంజిత్ దాస్ మీడియాకు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/