ఆ ఇద్దరు అమ్మల కుర్చీలు తుడిచి కూర్చోబెట్టిన తారక్

Update: 2022-11-02 05:43 GMT
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండమని చెబుతారు. ఇలాంటివి చాలామంది ప్రముఖులు.. సెలబ్రిటీలు తమ నోటితో చెబుతారు కానీ.. చేతల్లోకి వచ్చేసరికి మాత్రం తీరు మారుతుంది. అందుకు భిన్నంగా నోటితో మాటలు చెప్పకుండా చేతల్లో చూపించిన వైనం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కన్నడ నాట జరిగిన అవార్డు ఉత్సవానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా ఆయన తీరును మెచ్చుకుంటున్నారు.

ఎంత వినయం? ఎంత విధేయత? ఇది కదా ఒక ప్రముఖుడికి ఉండాల్సిన తీరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతకూ జరిగిందేమిటి? తారక్ ఏం చేశారన్న విషయంలోకి వెళితే.. 'కర్ణాటక రాజ్యోత్సవ' వేడుకలకు హాజరయ్యారు తారక్. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

వేదిక మీద వేసిన కుర్చీలు వర్షం కారణంగా తడిచాయి. వాటిని శుభ్రం చేసినప్పటికీ.. తడి మాత్రం అలానే ఉండిపోయింది. అలా వేసిన కుర్చీల్లో ఒక దానిలో దివంగత ప్రముఖ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి ఆశ్వినీ.. మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోవాల్సి వచ్చింది.

ఆ సందర్భంగా వేదిక మీద ఉన్న తారక్.. తన చేతిలో ఉన్న కర్చీప్ తో.. ఆ కుర్చీలకు ఉన్న తడిని స్వయంగా తుడిచారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో కుర్చీల్ని శుభ్రం చేసిన ఆయన.. వారిని కూర్చోపెట్టారు. ఈ తీరుతో సభకు హాజరైన వారితో పాటు.. అతిధులు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

తారక్ లోని ఈ సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చేసిన పనికి నెటిజన్లు పెద్ద ఎత్తున పొగిడేస్తున్నారు. ఈ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News