వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధిని చూసి 80 శాతం ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కావాలని పట్టుదలతో పనిచేస్తున్న చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలు దురదృష్టకరమని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా రక్షించలేడని భూమన కరుణాకర్ రెడ్డి అనడానికి కారణం ఏమిటో చెప్పాలని కోరారు. గతంలో ఇలాంటి వార్నింగ్ లు ఇచ్చిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూసుకోండని జూపూడి వ్యాఖ్యానించారు.
గతంలో అలిపిరిలో చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారే దాడి చేస్తే దేవుడే కాపాడాడని ప్రజలు అంటున్నారని జూపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన వారిలో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నాడేమోనని జూపూడి వ్యాఖ్యానించారు. కాపు ఉద్యమంలో తునిలో రైలు ఎలా తగలబెట్టాలో చేసిన రిహార్సల్స్ మాటలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని జూపూడి తెలిపారు. ముద్రగడకు భూమన కరుణాకర్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధమేమిటి అని ప్రశ్నించారు. వారి సంభాషణలో ఇంజన్ వైపు కాకుండా వెనుక వైపు నుంచి రావాలని ఇచ్చిన ఆదేశాల రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్న నేపథ్యంలో కుట్రలకు కారణమైన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారిని దేవుడు కూడా కాపాడలేడని జూపూడి హెచ్చరించారు.
21 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన ఒక్కరినీ కాపాడుకోలేకపోయారని జూపూడి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ రుజువై జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూసుకోండని జూపూడి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజాసమస్యలపై తన సమయాన్ని అనుభవాన్ని వెచ్చిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని జూపూడి ప్రశంసించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/