నో ప్ర‌త్యేకం : టీడీపీ నేత‌ల స్పంద‌న‌

Update: 2015-07-31 13:13 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ఏ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా ఇప్ప‌ట్లో ఇవ్వ‌బోమ‌ని కేంద్ర స‌హాయ మంత్రి ఇంద్ర‌జీత్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు, ఎంపీలు త‌మ స్ప‌ద‌న‌లు తెలియ‌జేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని, ఆ నిర్ణ‌యంతో ఆంధ్రప్రదేశ్ 16 వేలకోట్ల రెవెన్యూ లోటు ఉందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు.  ఆర్ధిక సంఘాలు,ప్రణాళిక సంఘాలు నివేదికల ఆధారంగా హోదా ఇవ్వలేమనడం సరికాదని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా, నూతన రాజధాని నిర్మించుకోవాలన్నా ప్రత్యేక హోదా అవసరమని తెలిపారు.  అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీపడదని టీడీపీ నేత‌ జూపూడి ప్రభాకర్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ సీరియస్‌గా ఆలోచిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న పక్క రాష్ట్రంతో కాంగ్రెస్‌, వైసీపీ చేతులు కలిపిందని ఆయ‌న‌ ఆరోపించారు. కేంద్రం ప్రకటనతో వైసీపీ పండగ చేసుకుంటోందని జూపూడి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని టీడీపీ వదిలే ప్రసక్తే లేదని జూపూడి స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News