రాహుల్ పరువు నష్టం కేసులో విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

Update: 2023-04-27 11:01 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసును విచారించాల్సిన జస్టిస్ గీతా గోపీ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవటమే కాదు.. ఆ కేసును మరో బెంచ్ కు మార్చాలన్న విన్నపాన్ని చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీంతో ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జస్టిస్ గీతా గోపీ.. హైకోర్టు రిజిస్ట్రీకి ప్రత్యేక విన్నపాన్ని చేశారు. రాహుల్ గాంధీ కేసును తన బెంచ్ నుంచి మరో న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరారు.

ఈ ఊహించని ట్విస్టు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన విమర్శల పై పరువు నష్టం దావా వేయటం.. ఈ కేసులో రాహుల్ ను దోషిగా తేల్చి ఆయనకు జైలు శిక్ష విధంచటం.. అప్పీలు చేసుకునే వీలు కల్పించటం జరిగినా.. ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ధీంతో ఈ కేసు అప్పీలులో భాగంగా రాహుల్ గుజరాత్ హైకోర్టు ను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి ఆమె తప్పుకున్నారు. రాహుల్ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె కోరారు.

ఈ నేపథ్యంలో ఈ అంశం పై మరో రెండు రోజుల్లో ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందన్న అంశం పై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. న్యాయమూర్తి గీతా గోపీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Similar News