జ‌డ్డి అరెస్ట్‌...వంద మంది పోలీసులతో ర‌చ్చ‌

Update: 2017-03-17 13:32 GMT
న్యాయ‌మూర్తుల మ‌ధ్య త‌లెత్తిన వివాదం తారాస్థాయికి చేరింది. న్యాయ‌స్థాన ఆదేశాల‌ ఉల్లంఘ‌న కేసులో కోర్టుకు హాజ‌రు కానందుకు హైకోర్టు జ‌డ్జి సీఎస్ క‌ర్ణ‌న్ సుప్రీంకోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే దీనిని తీవ్రంగా నిర‌సించిన క‌ర్ణ‌న్‌.. ఆ రోజే సుప్రీం జ‌డ్జీల‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ప‌రిణామం ఇలా ఉండ‌గా వ్య‌క్తిగ‌తంగా వెళ్లి క‌ర్ణ‌న్‌ కు వారెంట్ ఇవ్వాల‌ని గ‌త‌వారం పోలీస్ చీఫ్‌ ను సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో నేడు ఆయ‌న‌కు వారెంట్ ఇవ్వ‌డానికి వంద మంది సిబ్బందితో క‌లిసి క‌ర్ణ‌న్ ఇంటికి కోల్‌ క‌తా న‌గ‌ర పోలీస్ చీఫ్‌ వెళ్లడం క‌ల‌క‌లం రేకెత్తించింది.

త‌న‌ను మాన‌సికంగా వేధించార‌ని, త‌న సోష‌ల్ లైఫ్‌ ను దెబ్బ‌తీశార‌ని క‌ర్ణ‌న్ ఆరోపిస్తున్నారు. తాను ద‌ళితున్న‌నే ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని ఆయ‌న అన్నారు. ఓ హైకోర్టు న్యాయ‌మూర్తికి బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌డం భార‌త న్యాయ‌చ‌రిత్ర‌లోనే తొలిసారి జరిగింద‌ని మీడియాతో మాట్లాడుతూ క‌ర్ణ‌న్ ఆరోపించారు. కేంద్రంలో ఇప్ప‌టి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతే ఇలా జ‌రుగుతున్న‌ద‌ని, ద‌ళితుల‌ను అణ‌చివేస్తున్నార‌ని క‌ర్ణ‌న్ ఆరోపించారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ రూ.14 కోట్లకు దావా వేస్తాన‌ని క‌ర్ణ‌న్ స్ప‌ష్టంచేశారు. ధ‌ర్మాస‌నంలో ఏడుగురు న్యాయ‌మూర్తుల‌పై కేసు ఫైల్ చేసి, విచార‌ణ జ‌రిపి నివేదిక‌ను ఢిల్లీలోని సీబీఐ కోర్టు ముందు ఉంచాల‌ని సీబీఐ డైరెక్ట‌ర్‌ ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఇలాంటి ఆర్డర్ ఇవ్వాల‌ని అడిగిన అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీపైనా విచార‌ణకు ఆదేశించారు. త‌న‌పై ఉన్న వారెంట్‌ను ర‌ద్దు చేయాల‌ని గ‌త‌వార‌మే క‌ర్ణ‌న్‌.. రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News