అఫిషియ‌ల్ః వైసీపీకి జ్యోతుల గుడ్‌బై

Update: 2016-03-29 11:58 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదుర‌వుతున్న షాక్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో ఎపిసోడ్ అధికారికంగా తెర‌మీద‌కు వ‌చ్చింది. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడ‌ర్‌, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్ష పదవితో పాటు పీఏసీ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవులకు ఆయ‌న గుడ్‌బై చెప్పేశారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న రాజీనామా చేసిన‌ లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు పంపారు. పార్టీ అంచ‌నాల మేర‌కు తాను ప‌నిచేయ‌లేక‌పోతున్నాన‌ని పేర్కొంటూ రాజీమానాను ఆమోదించాల్సిగా జ్యోతుల నెహ్రూ కోరారు.

అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా జ‌రుగుతున్న ద్ర‌వ్య‌ వినిమ‌య బిల్లు చ‌ర్చ‌లో త‌ప్ప‌కుండా పాల్గొనడ‌మే కాకుండా వ్య‌తిరేకంగా ఓటు వేయాల్సిందిగా వైసీపీ విప్ జారీచేసింది. అయిన‌ప్ప‌టికీ జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లాకు చెందిన‌ మ‌రో ఎమ్మెల్యే వ‌రుపుల సుబ్బారావు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో వారు పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌ని తేలింది. కార్య‌క‌క‌ర్త‌ల స‌మావేశంలో ఇప్ప‌టికే వ‌రుపుల పార్టీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించగా....తాజాగా నెహ్రూ ఈ మేర‌కు టాటా చెప్పారు.
Tags:    

Similar News