కాంగ్రెస్ సర్కారును కూలిస్తే.. సింధియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చిన ఆఫర్ ఇదే

Update: 2020-03-10 07:30 GMT
బోటాబోటీ మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి రెడీ అయిన కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియాకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. బెంగళూరులో తన 17మంది ఎమ్మెల్యేలతో మకాం వేసిన సింధియా ఈ ఉదయం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రాంగం నడుపుతున్నారు.

ఈ సందర్భంగానే మోడీషాలు సింధియాకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సింధియా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారును కూలిస్తే రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్రమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.

దీంతో ప్రస్తుతం సింధియా తన అనుయాయులు, నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే సింధియా మేనత్త బీజేపీ రాజస్థాన్ శాఖలో కీలక నేత. బీజేపీ లో చాలా మంది సింధియా బంధువులు కీలక స్థానాల్లో ఉన్నారు. వారంతా కూడా ఒత్తిడి తెస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన సింధియా గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ఎలాగూ మధ్యప్రదేశ్ పీఠం ఇవ్వడం లేదు. సో ఇలాగైనా సింధియా ఖ్యాతి పెంచుకోవాలని చూస్తున్నారు.
Tags:    

Similar News