ప్రాంతీయ పార్టీ నేతలకు తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉండే ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ...అందులోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఉంటే...ఇక వారి ధైర్యానికి హద్దులు ఉండవనే సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరిగింది. అమ్మ జయలలిత మరణంతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమిళనాడుపై కన్నేసిన బీజేపీ...అధికార అన్నాడీఎంకే విషయంలో అనూహ్యమైన ఆప్యాయతను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఆ పార్టీకి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత - తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ తమకు అండగా ఉన్నారని.. ఎవరూ అన్నాడీఎంకేని ఏమీ చేయలేరని వెల్లడించారు. అన్నాడీఎంకే రెండాకుల గుర్తు తప్పకుండా సీఎం పళనిస్వామి వర్గానికే వస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన తెలిపారు. ‘ప్రధాని నరేంద్రమోడీ మనతో ఉన్నారు. మా పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు.. పార్టీని ఏ ఒక్కరూ విడగొట్టలేరు’ అని మంత్రి బాలాజీ వివరించారు. డీఎంకే సహా ఎవరూ అధికార అన్నాడీఎంకేని ఎదిరించలేరని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో 92శాతం మంది జనరల్ కౌన్సిల్ సభ్యులు పళనిస్వామికే మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
బయట నుంచి కుట్రలు చేసేవారు...కోర్టు కేసుల ఆధారంగా ఇరుకున పెట్టాలని చూసేవారు...తమిళనాడు సీఎం పళనిస్వామిని పదవి నుంచి దింపేయాలని భావించే వారి కుట్రలు విఫలం అవడం ఖాయమని మంత్రి రాజేంద్ర జోస్యం చెప్పారు. అమ్మ ఆశీస్సులతో, ప్రధాని మోడీ అండతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని తెలిపారు.