పోటాపోటీగా సాగిన ఏపీ ఎన్నికల్లో ప్రజలు అదే పనిగా టెన్షన్ కాకుండా ఉండేందుకు దేవుడు పంపిన వ్యక్తిగా ప్రజాశాంతిపార్టీ అధినేత కేఏపాల్ ను చెప్పాలి. తన వంతుగా ఆయన ఎంత కష్టపడాలో అంత పడ్డారు. ప్రపంచ దేశాల్లోని తోపుల్లాంటి నేతలతో తరచూ షేక్ హ్యాండ్స్ ఇవ్వటమే కాదు.. వారికి సలహాలు.. సూచనలు ఇచ్చే స్థాయి ఉన్న కేఏపాల్ కనికరించి ఏపీ ప్రజల బతుకుల్ని మార్చేద్దామని ఎన్నికల్లో నిలుచున్నారు.
అంత పెద్ద మనిషి మీద కనీస గౌరవం లేకుండా కామెడీ పీస్ గా మార్చేశారు. అయినా.. సర్లే క్షమాగుణంతో అలాంటి వేమీ పట్టించుకోని పాల్.. జనాలకు మరింత వినోదం కలిగించే ప్రయత్నం చేశారు. మీడియాలో బాగా నానిన ఆయన.. ఎన్నికల ఫలితాల మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. తానంత వినోదం అందించిన తర్వాత అంతో ఇంతో అంచనాలు ఉంటాయి కదా. కామెడీ కామెడీనే.. రాజకీయాలు రాజకీయాలే అన్నట్లుగా ఏపీ ప్రజలు యూట్యూబ్ లో పాల్ వీడియోలకు బోలెడన్ని లైకులు.. కామెంట్లు పెట్టేశారు కానీ ఓట్లు వేయటానికి మాత్రం ఒప్పుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 స్థానాలు జగన్ కు రావటం ఏమిటి? అన్నది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈవీఎంలు.. వీవీ ప్యాట్ ల మీద థీసెస్ చేసినట్లుగా వరుస అభ్యంతరాలు చెప్పే చంద్రబాబు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత కామ్ గా ఉన్న వేళ.. అందుకు భిన్నంగా పాల్ మాత్రంఈవీఎంల మీద బోలెడన్ని అనుమానాలు వ్యక్తం చేయటమే కాదు.. అదేదో కుట్ర చేశారని వ్యాఖ్యానించేశారు. అలా ఎలా సీట్లు వస్తాయండి? ఎలా సాధ్యం? అంటూ ఏపీ ఫలితాన్ని ప్రశ్నించటమే కాదు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీకి అన్ని సీట్లు రావటం ఏమిటి? అంటూ నిలదీశారు.ఇప్పటివరకూ నవ్వులు పూయించే పనిని విజయవంతంగా పూర్తి చేసిన పాల్ మాష్టారు.. తాజాగా విడుదల చేసిన వీడియోలో యమా సీరియస్ గా మాట్లాడారు. అదేమిటో.. పాల్ సార్ ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నా.. దాన్ని చూస్తున్న వారికి.. వింటున్న వారికి అప్రయత్నంగా పెదాల మీద నవ్వులు వచ్చేస్తున్నాయి. ఇక.. వీడియో కింద కామెంట్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

Click Here For Video