బిగ్ బ్రేకింగ్: కేఏపాల్ కు ఎన్ని ఓట్లంటే?

Update: 2019-05-23 07:06 GMT
కేఏ పాల్.. ఏపీ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీచేసిన నాయకుడు. ఏపీలో ఎండల వేడిలో రాజకీయంగా కామెడీ పంచిన నేత.. సీరియస్ పాలిటిక్స్ లో కామెడీ పంచుతూ యూట్యూబ్ స్టార్ గా మారారు. ఇక కేఏపాల్ తన పార్టీ తరుఫున పోటీచేయించడమే కాదు.. స్వయంగా నర్సాపురంలో పోటీచేశారు.

గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ సీటుపై కేఏపాల్ ప్రజాశాంతి పార్టీపై పోటీచేయగా.. జనసేన నుంచి నాగబాబు.. టీడీపీ నుంచి వెంకట శివరామ రాజు, వైసీపీ నుంచి రఘురామకృష్ణం రాజు పోటీచేశారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తోంది. ఆ కోవలోనే నర్సాపురంలో కూడా వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు లీడింగ్ లో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఆయన 64349ఓట్లు వైసీపీ అభ్యర్థి  సాధించి సమీప టీడీపీ అభ్యర్థిపై 6వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక జనసేన అభ్యర్థి నాగబాబు 30321 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రధాన పార్టీలను పక్కనపెడితే ఏపీలో అధికారం చేపడుతానని.. నియోజకవర్గానికి 100కోట్లు ఖర్చు పెడతానని..తనను గెలిపించాలని బీరాలు పలికిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కు తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి కేవలం 80ఓట్లు మాత్రమే రావడం విశేషం. ఈ ఫలితాలు చూసి కేఏపాలే కాదు.. ఆయన అభిమానులు షాక్ తిన్నారు.


Tags:    

Similar News