అది నల్లగొండ జిల్లాలోని లింగోజీగూడెం.. జాతీయ రహదారి నంబరు 9.. అక్కడో హోటల్.. ఓ ప్రముఖుడు విలేకరుల సమావేశం ఉందని మీడియాను పిలిచాడు. దీంతో పాత్రికేయులు, ఫొటో-వీడియోగ్రాఫర్లంతా అక్కడకు వెళ్లారు. కానీ, ఆ ప్రముఖుడు కనిపంచలేదు. కాస్త తేరిపార చూస్తే.. హోటల్ ఫ్యామిలీ సెక్షన్ లోని బెంచీపై పడుకుని కనిపించాడు. పావుగంట, అరగంట అయినా లేవలేదు. హాయిగా కునుకుతీసి గంట తర్వాత ఆవులిస్తూ లేచారు. అనంతరం తాపీగా విలేకరులతో మాట్లాడారు. తనదైన శైలిలో మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని, మీ గుండెల్లో నేనున్నానని అన్నారు. ఆయనెవరో మీకు తెలిసిందనుకుంటా..? ఇంకెవరు..? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్.
విలేకరులను రమ్మని..
మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కేఏ పాల్.. లింగోజీగూడెంలోని హైవే-9లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం ఉందని సమాచారం ఇచ్చారు. తీరా విలేకరులు వెళ్లేసరికి హోటల్‌లో బెంచీపై పడుకుని నిద్రపోయి కనిపించారు. మమ్మలి రమ్మని ఇలా చేయడం ఏమిటని మీడియా అడిగితే.. ఆయన ఇచ్చిన సమాధానం కూడా భిన్నంగా ఉంది. తన గది తాళంచెవి తన దగ్గరే ఉందని, ఆ గదిని తెరాస ఎమ్మెల్యేలకు కేటాయించడంతో ఇక్కడ పడుకున్నానని చెప్పారు. మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని, మీ గుండెల్లో నేనున్నానని తెలిపారు.
27 మంది స్వతంత్రుల మద్దతు.. తగ్గేదేలె..
తనకు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నారని చెప్పారు. భాజపా వాళ్లు ఓడిపోతున్నారని తెలిసి నా ప్రియ శిష్యుడు జేపీ నడ్డా మునుగోడు సభకు రాకుండా రద్దు చేశారని తెలిపారు. తన గెలుపే వారి గెలుపుగా ప్రకటించాలని కోరుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిరెడ్డి కూడా తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెరాస మూడు నెలల్లో రూ.11,200 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లు సమాచారముందన్నారు. ఇందులో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ నియోజకవర్గం బాగయ్యేది కదా కేసీఆర్ అని ప్రశ్నించారు.
తెరాస వాళ్లు తాను అద్దెకు తీసుకున్న గది కూడా దక్కకుండా చేస్తున్నారని, నిన్న దాడి చేయడానికి ప్రయత్నించారని, అయినా...తగ్గేదేలే! అని తెలిపారు.
గొర్రెల కాపరిగా.. రైతుగా.. దుకాణదారులను కలుస్తూ..
మిగతా స్వతంత్ర అభ్యర్థుల్లా కాకున్నా.. కేఏ పాల్ మునుగోడులో సీరియస్ గానే ప్రచారం చేస్తున్నారు. ఆదివారం గొర్రెల కాపరి వేషధారణలో కనిపించారు. తెరాస ప్రభుత్వంలో గొర్రెల కాపరులు నరకం చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు చేసిన యువతకు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు ప్రచారం చేస్తున్నానని చెప్పడం విశేషం. అయితే, జర్నలిస్టు ఒకరు 10 తర్వాత ప్రచారం కుదరదని చెప్పగా.. ఆ తర్వాత 2 గంటలు ప్రవాస ఓటర్లతో మాట్లాడుతున్నానని సమాధానం ఇచ్చారు. మొత్తానికి తెల్లవారుజాము 2 గంటల దాకా తాను అవిశ్రాంతంగా ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నట్లు వివరించారు. మరో వీడియోలో ఓ దుకాణంలో మహిళతో పాల్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. జంపింగ్ లు, ఇతర విషయాలపై ఆమె సమాధానం విన్న పాల్.. నీలాంటి ఆమె రాజకీయాల్లోకి రావాలంటూ కోరడం విశేషం.