ఏపీ, తెలంగాణల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ మాదే గెలుపు.. : పాల్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల తరచుగా మీడియా ముందుకు వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి.. తన వ్యూహాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణల్లోని 41 పార్లమెంటు సీట్లు దిగ్విజయంగా గెలుస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందన్న పాల్... ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఈ విషయం మీడియా సహా.. ఆయా పార్టీలు కూడా రాసి పెట్టుకోవాలని.. పాల్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ లోక్‌సభ స్థానం తప్ప... ఆంధ్ర, తెలంగాణల్లోని 41 సీట్లు గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అలాగే దక్షిణభారత రాష్టాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందన్న పాల్... ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణతోపాటు దేశ అప్పులపై... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించానన్నారు.
అవినీతి లేని రాజ్యం కోసం పొరాడుదామని పిలుపునిచ్చారు కేేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజా శాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ఏపీలో 175 నియోజకవర్గాలు సహా 25 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. ఇక, ఈ నెల 28న సాయంత్రం 5 నుంచి 9 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ పెడుతున్నట్లు ప్రకటించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే.. కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని విచారణలు జరుపుతామన్నారు. ఒక సంవత్సరం ఆగుదామన్నారు. త్వరలో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు.
``నేను కేటీఆర్ నియోజకవర్గంలో పోటీ చేసినా.. నేను గెలుస్తాను. ఎక్కడా చేసిన గెలుస్తా... ఏపీలో గతేడాది పోటీ చేశాను అనేది అబద్ధం.. జస్ట్ నామినేషన్ వేశాను అంతే. ఎన్టీఆర్‌కే 9నెలలు పట్టింది గెలవడానికి.. నాకు 6 నెలలైన పడుతోంది. నేను రుణపడి ఉంటే దేవుడికి, మీడియాకే రుణపడి ఉంటా... ఒక్కరూపాయి ఇవ్వకుండా మీరు ప్రచారం చేస్తున్నారు.. నా హృదయంలో మీరు ఉంటారు. తెలంగాణకు వచ్చి 3 సంవత్సరాలు అయింది. మార్చి నెలలో తెలంగాణ భవన్‌లో రైతులు కోసం ధర్నా చేశాను. అని పాల్ వివరించారు``
కాగా, ఇటీవల తనపై జరిగిన దాడి.. తర్వాత.. ఆయన హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయాలపై కూడా పాల్ స్పందించా రు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను అమిత్ షాకు వివరించినట్టు చెప్పారు. తనపై జరిగిన దాడిని కూడా వీడియో చూపించానని అన్నారు. అయితే.. దీనిపై చర్యలకు కేంద్రమే రంగంలోకి దిగుతుందో.. రాష్ట్రానికి చాన్స్ ఇస్తుందో మాత్రం తనకు తెలియదన్నారు. తాను మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లను వదిలి పెట్టేది లేదని.. పాల్ వ్యాఖ్యానించారు.