తెలంగాణలో ప్రభావశీల శక్తిగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడమనే ఎజెండాతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ మాదాపూర్ హెచ్ఐసీసీలోని అట్టహాసంగా ప్లీనరీ నిర్వహించుకుంటోంది. ఈ సభకు 3 వేల మంది టీఆర్ఎస్ ప్రజాప్రతిధులు హాజరయ్యారు.
కేసీఆర్ ప్రసంగం తర్వాత 13 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అయితే, ఈ ప్లీనరీ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయమైంది. సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. ప్లీనరీ కోసం కొన్నిచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్కు అడ్డగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ ట్విట్టర్ ఖాతాకు వస్తున్న ఫిర్యాదులకు మాత్రమే అధికారులు ఫైన్లు వేశారు. అయితే, ప్లీనరికి ముందు రోజు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కేఏ పాల్ నేరుగా ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
టీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో రూల్స్ కి విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించాలని కోరుతూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు ఎలా పెడతారని పాల్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని గతంలో ప్రభుత్వం చెప్పిందని.. ఇప్పుడు ఎందుకు రూల్స్ ని బ్రేక్ చేశారని కేఏ పాల్ హైకోర్టుకు నివేదించారు.