న‌న్నెంత దారుణంగా హింసించాడో చంద్ర‌బాబు!

Update: 2019-06-16 12:16 GMT
ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పేరు విన్నంత‌నే ముఖం మీద న‌వ్వు రావటం ఖాయం. ఆయ‌న్నో కామెడీ పీస్ గా చేశార‌న్న విమ‌ర్శ ఉంది. త‌న‌ను  ప్ర‌పంచ దేశాల్లో దేశాధ్య‌క్షులు.. ప్ర‌ధాన‌మంత్రులు స్వ‌యంగా ఆహ్వానించి.. గౌర‌వంగా మ‌ర్యాద‌లు చేస్తార‌ని.. స‌త్కారాలు చేస్తార‌న్నారు.అలాంటి త‌న‌ను వేధించార‌ని చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. త‌న‌కు భ‌ద్ర‌త పెంచ‌మ‌ని రాష్ట్ర హైకోర్టు.. కేంద్ర హోం మంత్రి చెప్పినా బాబు స‌ర్కార్ విన‌లేద‌న్నారు.

త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఏడుగురు ఇప్ప‌టివ‌ర‌కూ మిగిల్లేద‌ని.. చంద్ర‌బాబుకు తాజాగా ఎలాంటి గ‌తి ప‌ట్టిందో చూశారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగు.. ఇంగ్లిషులో విడుద‌ల చేసిన తాజా వీడియో సంచ‌ల‌నంగా మారింది. మ‌ధ్య మ‌ధ్య‌లో ఎడిట్ ఉన్న ఈ ఎనిమిది నిమిషాల వీడియోలో పాల్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  

పాల్ చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్నిచూస్తే..

చంద్ర‌బాబు ఎలాంటి గ‌తి ప‌ట్టిందో కార‌ణాలు అనేకం ఉన్నాయి. అవ‌న్నీ గుర్తు చేస్తా. ఇదే గ‌తి.. ఈ రోజు ఉన్న ముఖ్య‌మంత్రి.. మంత్రులు.. ప్ర‌ధాన‌మంత్రికి ప‌ట్టే అవకాశం ఉంది.  ప్ర‌పంచంలో నాకు ద‌క్కినంత గౌర‌వం మ‌రే సాధార‌ణ పౌరుడికి ద‌క్క‌లేదు. అది సిరియా కావొచ్చు.. లిబియా కావొచ్చు. కానీ.. మ‌న దేశంలో మ‌న రాష్ట్రంలో మ‌న వాళ్లు చూసినంత దారుణంగా ఎవ‌రూ చూడ‌లేదు. 

నేను ఎవ‌రి చ‌రిత్ర చ‌ద‌వలేదు. కానీ.. చ‌రిత్ర‌లో ఎవ‌రికి ద‌క్క‌నంత గౌర‌వ మ‌ర్యాద‌లు నాకు ద‌క్కాయి. ఏ దేశానికి వెళ్లినా దేశాధ్య‌క్షుడు.. ప్ర‌ధాన‌మంత్రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికేవారు. సిరియా.. లిబియా.. ఇథియోపియా.. ఇలా ఏ దేశం వెళ్లినా మ‌ర్యాద ల‌భించేవి. వివిధ దేశాల్లోని పార్లమెంటులో ప్ర‌సంగించిన ప్రైవేటు వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది నేనే. చివ‌ర‌కు ముస్లిం దేశ‌మైన సూడాన్ లో కానీ ఆఫ్రిక‌న్ దేశ‌మైనా.. నన్ను వారి పార్ల‌మెంటులో ప్ర‌సంగించే అవ‌కాశం ఇచ్చారు.ఇదంతా గ‌ర్వంగా  చెప్ప‌టం లేదు బాధ‌తో చెప్ప‌టం లేదు.

అలాంటి కేఏ పాల్ కు పిచ్చ న‌ర‌కం చూపించారు. ఒక‌ప్ప‌టి పాత సీఎం.. ఇప్ప‌టి చంద్ర‌బాబు. న‌వంబ‌రులో జెడ్ ప్ల‌స్ సెక్యురిటీ ఇవ్వ‌మని హైకోర్టు ఆర్డ‌ర్ వేస్తే ఇవ్వ‌లేదు. డిసెంబ‌రులో మ‌ళ్లీ అడిగితే ఇవ్వ‌లేదు. మార్చి 11న కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ గౌర‌వంగా పిలిచి మాట్లాడి ఆదేశాలు ఇచ్చినా అమ‌లు చేయ‌లేదు.

 న‌న్ను ఇండియాలో నుంచి పంపించేయాల‌నుకున్నారు. 2007 జులై 7న ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇంటి బ‌య‌ట వెయిట్ చేసి మ‌రీ న‌న్ను ఘ‌నంగా ఆహ్వానించారు. నా పీస్ మిష‌న‌రీ సంస్థ‌ను దెబ్బ తీద్దామ‌ని ప్ర‌య‌త్నించారు. అబ‌ద్ధ‌పు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.

వంద కేసులు పెట్టినా ఇండియా వ‌దిలిపెట్ట‌ను. ఒక పిచ్చోడిలా చూపించి.. ఒక క‌మెడియ‌న్ లా చూపించారు. సత్యాన్ని తెలుసుకుంటార‌ని మాట్లాడుతున్నా. చంద్ర‌బాబుకు ఎప్పుడో చెప్పారు డిసెంబ‌రు త‌ర్వాత ఆ పార్టీ ఉనికి ఉండ‌ద‌ని. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఎంత‌గానో దీవించాను.  2008 ఉప ఎన్నిక‌ల్లో నా డ‌బ్బు క‌ట్టి కేసీఆర్ కు అండ‌గా నిలిచా. అలాంటి నా మీద ఈ రోజు త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నారు.

తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ కూడా త‌ప్పులు కేసులు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంద‌ని విన్నాను. ప్ర‌జ‌ల‌రా అలాంటి ప్చారాన్ని న‌మ్మ‌మాకండి. కేసీఆర్ కూడా గ‌డ్డి తినే రోజులు రానున్నాయి.  శాంతిని కోరుకునే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన కేఏ పాల్ అనే వ్య‌క్తిని టార్గెట్ చేసి హింసించారు. వీసాల కోసం డ‌బ్బులు తీసుకున్న‌ట్లుగా కొన్ని మీడియా సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. ఒక ప్ర‌సంగానికి 5 మిలియ‌న్ డాల‌ర్లు ఇస్తారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చినంత మాత్రాన దైవ జ‌నుడిని కాద‌నుకుంటున్నారా?  నా జోలికి రావొద్దు. వ‌స్తే ఇబ్బందులు ప‌డ‌తారు. న‌న్ను కానీ.. నా ఆస్తుల్ని కానీ ట‌చ్ చేశారా?  అంతే. ఇప్ప‌టికి ఏడుగురు ట‌చ్ చేశారు.. . ఏడుగురు వెళ్లిపోయారు. ఒక్క‌ళ్లు కూడా మిగ‌ల్లేదు.


Tags:    

Similar News