కళ్తు నెత్తికెక్కాయి.. నాతో పెట్టుకోవద్దు.. రంగంలోకి కేఏపాల్

Update: 2020-12-23 10:23 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ హల్ చల్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆ తర్వాత అమెరికా వెళ్లి కనిపించలేదు. రాజకీయాల్లోనూ అలజడి రేపలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కేఏపాల్ మరోసారి తెరపైకి వచ్చారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 24న విశాఖలో గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ప్రభుత్వం అడ్డుకుంటోందని.. సీఎంకు కళ్లు నెత్తికెక్కాయని కేఏ పాల్ మండిపడ్డారు.. గురువారం విశాఖ నుంచి 200 దేశాల నుంచి 2700మందితో ఏడు గంటల నుంచి 9 గంటల గ్లోబల్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని చానెల్స్ లైవ్ ఇస్తున్నాయన్నారు. దీనిని ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.

గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశారని ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. తన అసిస్టెంట్ విజయ్ విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, అంబటి రాంబాబు, నందిగం సురేష్, నర్సరావుపేట ఎంపీ, నీలం సాహ్నీ, జగన్ పీఏ కేఎన్ఆర్‌ను కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనతో గొడవకు దిగారని.. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో కొనసాగుతున్నారని ఆరోపించారు. ఏపీలో కరోనా ప్రోటోకాల్ ఉండడంతో 230 మందిని 23 జిల్లాల నుంచి ఆహ్వానించామని.. అయినా ఏపీ సీఎం జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో క్రికెట్ పోటీలకు కరోనా లేదా.. 230 మందితో కార్యక్రమం పెడితే అనుమతి కావాలా అంటూ పాల్ ప్రశ్నించారు. దేవుడి శాపానికి సీఎం జగన్ గురికావొద్దని.. ట్రంప్‌కు కూడా భయపడలేదని.. తనతో పెట్టుకుని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారన్నారు.
Tags:    

Similar News