రష్యా-ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చర్చలకు సిద్దమంటూనే రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. రష్యా వేగం-ఉక్రెయిన్ ఆర్ధనాధాల మధ్య ప్రపంచ దేశాలు రష్యాని దుమ్మెత్తిపోస్తున్నాయి. పుతిన్ చేపట్టిన సైనిక చర్యని తుగ్లక్ చర్యగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తున్నాయి.
భారత్ ఏ దేశానికి మద్దతు ప్రకటించకుండా మౌనం వహిస్తోంది. భారత్ పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్య అన్న చందంగా తయారైంది. రష్యాకి మద్దతు ప్రకటించలేదు. అలాగని ఉక్రెయ్ ని వెనుకేసుకుని రాలేదు. రెండు దేశాలతో మిత్రుత్వం కోరుకునే దేశాల పరిస్థితి దాదాపు ఇంతే.
నాటో లో సభ్యత్వం ఉన్న దేశాలు మాత్రం రష్యా చర్యని ఎండగడుతున్నాయి. అయితే నాటో కన్నా వేగంగా దూసుకుపోతు న్నాడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాకుడు కె.ఏ పాల్. ఉక్రెయిన్ కి మద్దతుగా పాల్ తనదైన శైలి మద్దతు తెలిపాడు. ``పుతిన్ ప్రార్ధన చేస్తున్నాం. తగ్గేదేలే`` అంటూ ``పుష్ప`` సినిమాలో బన్నీ స్టైల్లో అతని మ్యానరిజాన్ని అనుకరించి చెప్పారు.
బన్నీ సినిమాలో ఎడమ చేతితో గెడ్డం దువ్వుతూ కోపంతో `తగ్గేదేలే` అంటాడు. సరిగ్గా అదే సన్నివేశాన్ని పాల్ పుతిన్ పై తగ్గేదేలా అంటూ రిపీట్ చేసారు. దానికి సంబంధించిన ఓ వీడియోని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేసారు.
పాల్ ని వర్మ తరుచూ ఫాలో అవుతారు. అతని వేషధారణ..క్రైస్తవ మత ప్రచారాలకు సంబంధించిన వీడియోల్ని సైతం అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు. పాల్ పాత్రని సైతం తన సినిమాలో వినియోగించుకున్నాడు. అప్పట్లో దీనిపై పాల్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసారు. తన ప్రతిష్టని వర్మ దిగజార్చుతున్నారంటూ మండిపడ్డారు. కోర్టులో పరువు నష్టం దావా కేసులు వేస్తానని హెచ్చరించడం జరిగింది. తాజాగా వర్మ షేర్ చేసిన వీడియోపై నెటి జనుల కామెంట్లు ఆసక్తికరం.
రష్యా-ఉక్రెయిన్ వార్ ని కూడా పాల్ వాడేస్తున్నాడంటే కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియోపై పాల్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ``# సేవ్ ఉక్రెయిన్ # తగ్గేదేలే`` అనే పాల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పాల్ వెనుక కొంత మంది ఉక్రెయిన్ కి మద్దతుగా నిలిచారు.
Full View