ఐపీఎల్​ కు సెలెక్టయిన కడప బిడ్డ..!

Update: 2021-02-19 06:10 GMT
ఆంధ్రప్రదేశ్​ లోని కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ ​రెడ్డి (22) ఐపీఎల్​ కు సెలెక్టయ్యాడు. గురువారం చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్ వేదికగా సాగిన ఐపీఎల్​ కు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హరిశంకర్​ ను 20 లక్షల రూపాయలకు దక్కించుకున్నది. అతడి బేస్​ ప్రైజ్​ అంతేకాగా అదే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని జట్టులోకి తీసుకున్నది. ‘ల్యాండ్ ఆఫ్ బాహుబలి నుంచి ఒకరిని జట్టులోకి తీసుకున్నాం’ అంటూ మారం రెడ్డి ఎంపిక పై.. చెన్నై సూపర్​ కింగ్స్​ ట్వీట్​ చేసింది.  ఈ ట్వీట్​ ప్రస్తుతం సోషల్​ మీడియా లో వైరల్ ​గా మారింది.

హరిశంకర్​ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి. పేస్ బౌలర్​ అయిన హరిశంకర్​ కుడిచేతి వాటంతో బౌలింగ్​ చేస్తాడు.  వేలంపాటలో మొత్తం 292 మందికి మాత్రమే అవకాశం లభించింది. అందులో మారంరెడ్డి ఒకరు.  ప్రస్తుతం మారంరెడ్డి ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 జనవరి 11న ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అప్పటినుంచి ఇతడి పేరు వినిపిస్తున్నది.

ఈ సందర్భంగా మారంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ధోని జట్టులో తొలిసారి ఐపీఎల్ ​కు ఆడే అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ధోనీ లాంటి లెజెండ్​ తో డ్రెస్సెంగ్​ రూమ్​ ను పంచుకొనే చాన్స్​ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నన్ను నేను నిరుపించుకొనేందుకు ఐపీఎల్​ మంచి వేదిక’ అని మారంరెడ్డి అన్నారు.చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ - సురేష్ రైనా - అంబటి రాయుడు - రవీంద్ర జడేజా - దీపక్ చాహర్ - ఫాప్ డుఫ్లెసిస్ - శార్దుల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
Tags:    

Similar News