ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పన్నెండుకు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మరొకటి పెరిగింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరనున్నారు. శనివారం కదిరి నుంచి 50 వాహనాలలో భారీ ర్యాలీగా విజయవాడ తరలివెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ ఎమ్మెల్యేల చేరిక విషయంలో ముందుగా వార్తలు వెలువడినప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకోకపోవడం గమనార్హం. ఒకవేళ జగన్ స్పందించి ఎమ్మెల్యేలతో తన దూతల ద్వారా మాట్లాడిస్తున్నప్పటికీ ఫలితం ఉండకపోవడం కొసమెరుపు. ఈ ఎమ్మెల్యేల చేరిక పరిణామం రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.