తెలంగాణ అధికారపక్షానికి.. తెలంగాణ రాజకీయ జేఏసీ మధ్య దూరం రోజురోజుకీ మరింత పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించి.. దాదాపు రెండేళ్ల పాటు నోరు విప్పకుండా వెయిట్ చేసిన తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం.. ఈ మధ్యన గళం విప్పటం తెలిసిందే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తీవ్రస్థాయిలో తప్పు పడుతున్న విపక్షాలకు తగ్గట్లే.. తెలంగాణ సర్కారుపై నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తమ విధానాల్ని తప్పు పడుతున్న కోదండం మాష్టారిపై ఏ మాత్రం అవకాశం చిక్కినా విమర్శలు చేస్తున్న తెలంగాణ అధికారపక్షం.. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి. జయశంకర్ మాష్టారి పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణ దశ.. దిశ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి.. ఆ వేదికను రాజకీయ విమర్శలకు అనువుగా మార్చుకోవటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రసమితి ఎంత పోరాటం చేసిందో.. తెలంగాణ రాజకీయ జేఏసీ అంతే కీలకభూమిక పోషించిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు.. దాని ఛైర్మన్ గా కోదండరాం వ్యవహరించిన తీరును ఎవరూ తప్పు పట్టలేరు కదా.. ఉద్యమాన్ని ఏ దశలో అయినా ముందుకే తీసుకెళ్లారే తప్పించి.. ఎక్కడా వెనకడుగు వేయించింది లేదు. అలాంటి కోదండరాం మీద రాజకీయంగా ఉండే విభేదాలతో విమర్శలు చేయటం.. అది కూడా తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ వాదులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చిన జయశకంర్ మాష్టారి పుట్టినరోజు వేడుకల్ని వేదికగా చేసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని చెబుతూనే.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాల వలలో ప్రొఫెసర్ కోదండరాం పడుతున్నారంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తెలంగాణ వ్యతిరేకులకు అండగా నిల్చేలా కోదండరాం మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యనించిన కడియం.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన గుర్తించటం లేదన్నారు.
ఉద్యోగ.. ఉపాధి అవకాశాల కోసం అంటూ కోదండరాం ఉద్యమ షెడ్యూల్ జారీ చేయటం సరికాదన్న ఆయన.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న 25వేల ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాచారం ఇవ్వటం కోదండంకు తెలీదా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణను సస్యశామలం చేసే పాలమూరు ప్రాజెక్టుకు కోదండరాం వ్యతిరేకమా? అని ప్రశ్నించినా ఆయన.. అచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి నష్ట జరిగేలా ఏ రోజూ వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సిత్రంగా లింకు పెడుతున్న కడియం తెలివిని చూస్తే.. కించిత్ సంతోషించాల్సిందే. ఇలాంటి చతురత తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసే తప్పుల మీద పెడితే మరింత బాగుంటుందేమో..? కడియం మాటల్ని పక్కన పెడితే ఒక్క విషయం మాత్రం నిజమని చెప్పక తప్పదు. తెలంగాణ కోసం ఒకటిగా ఉద్యమించిన వారు తెలంగాణ ఏర్పాటు తర్వాత విమర్శలు చేసుకోవటం.. అది కూడా తన పుట్టినరోజు పేరు మీద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉంటుందని జయశంకర్ మాష్టారు ఎప్పుడూ ఊహించి ఉండరేమో..?