వరంగల్ టీఆర్ఎస్ లో మాటల మంటలు చెలరేగాయి.ఏకంగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకోవడంతో టీఆర్ఎస్ లో రచ్చ మొదలైంది. ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానలా మారుతోంది.
టీఆర్ఎస్ కు చెందిన ఒక నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ సీటుకోసం మొన్నటి ఎన్నికల్లో కొట్టాడుకున్నారు. అయితే కేసీఆర్ నాడు రాజయ్యకు టికెట్ ఇచ్చి కడియంను పక్కనపెట్టారు. కడియంకు ఇప్పుడు ఏ పదవి కూడా ఇవ్వకుండా నాన్చుతున్నారు. వీరిద్దరూ కూడా కేసీఆర్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వారే.
తాజాగా ఈ ఇద్దరి మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ తీవ్ర పదజాలంతో కడియం విరుచుకుపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరచడం కాదని.. మగాళ్లు అయితే ఆర్థికసాయం చేయాలన్నారు.
‘నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగినా.. పదవి ఇప్పిస్తాననో ,పనులు ఇప్పిస్తాననో రూపాయి తీసుకున్నా ముక్కు నేలకు రాస్తాను’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు.
నెత్తిమీద పది రూపాయలు పెడితే.. రూపాయికి కూడా అమ్ముడు పోనివారు మాట్లాడుతున్నారంటూ కడియం శ్రీహరి నిప్పులు చెరిగాడు. దీంతో నియోజకవర్గంలో మళ్లీ రాజయ్య వర్సెస్ కడియం వార్ మొదలైంది.