మనోడి నోబెల్ ప్రైజ్ ను దొంగలెత్తికెళ్లారు

Update: 2017-02-07 07:11 GMT
అపురూపమైన వస్తువుల్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యమో.. లేక దొంగల మేథోతనమో కానీ.. స్వచ్ఛంద సేవ ద్వారా నోబెల్ శాంతిబహుమతిని సొంతం చేసుకున్న మనోడైన కైలాస్ సత్యార్థికి వచ్చిన నోబెల్ బహుమతి తాజాగా చోరీకి గురైంది. సోమవారం రాత్రి ఆయనింట్లోకి ప్రవేశించిన దొంగలు.. విలువైన నోబెల్ బహుమతిని చోరీ చేసిన వైనం బయటకు వచ్చింది.

2014లో పాక్ బాలిక మలాలాతో కలిసి ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. బచపన్ బచ్చో ఆందోళన సంస్థను నిర్వహిస్తున్న ఆయన.. బాలల హక్కుల మీద ఉద్యమిస్తున్నారు. ఆయనింట్లోకి జొరబడిన దొంగలు పలు విలువైన వస్తువుల్ని దోచుకెళ్లారని.. అందులో నోబెల్ బహుమతి కూడా ఉండటం గమనార్హం.

అయితే.. నోబెల్ లాంటి బహుమతుల్ని ఎవరైనా అందుకున్నప్పుడు.. వాటి ఒరిజినల్స్ ను రాష్ట్రపతి భవన్ లో భద్రంగా దాచి ఉంచుతారని.. వాటి నకళ్లను మాత్రమే విజేతలకు అందిస్తారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కు వచ్చిన నోబెల్ బహుమతిని కూడా దొంగలు దోచుకెళ్లారు. శాంతినికేతన్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలో జరిగిన ఈ దొంగతనానికి కారణమైన వ్యక్తిని తర్వాతి కాలంలో బంగ్లాదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News