చోరీ అయిన మ‌న నోబెల్ దొరికింది

Update: 2017-02-12 09:48 GMT
సామాజిక కార్యకర్త, నోబెల్ అవార్డ్ గ్రహిత కైలాస్ సత్యార్థి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీకి గురైన నోబెల్ పురస్కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. గ‌త వారం జ‌రిగిన చోరీలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగలు ప్రవేశించి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఆగ్నేయ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో సత్యార్థి నివసిస్తున్న ఇంటిలో నుంచి నోబెల్ బహుమతితోపాటు విలువైన వస్తువులు దొంగలు దోచుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సత్యార్థి పీఏ ఇంటికెళ్లి దొంగతనం జరిగిన విషయం గమనించాడు. ఇంట్లో లాకర్లన్నీ పగలగొట్టి ఉన్నాయని, దొంగతనం తెల్లవారుజామున జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించి ద‌ర్యాప్తు ప్రారంభించి నాలుగురోజుల్లోనే వారిని ప‌ట్టుకున్నారు.

బాలల హక్కుల కోసం పోరాడుతున్న కైలాష్ సత్యార్థికి 2014లో నోబెల్ బహుమతి లభించింది. కైలాష్ సత్యార్థి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కైలాష్ సత్యార్థి ఇంట్లో ఎవరూ లేరన్న విషయం దొంగలు తెలుసుకుని ఉంటారని, బాగా తెలిసినవారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. న్యూస్‌పేపర్ బాయ్, పాలుపోసే వ్యక్తితోపాటు ఇరుగు పొరుగువారిని ప్రశ్నించారు. సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించారు.  ఈ క్ర‌మంలో లోతైన ద‌ర్యాప్తు చేయ‌గా ఈ ఉదంతం నిందితులు దొరికారు.
Tags:    

Similar News