రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు... అడ్డుకోవడాలు... ఆటంకాలు సృష్టించడం సహజమే... అధికారం చేతిలో ఉంటే అవతలి పార్టీ సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాలు కూడా ఉంటాయి... మొన్నటికి మొన్న గుంటూరులో వైసీపీ నేత జగన్ దీక్షకు చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పిన సంగతి తెలిసిందే.... బీహార్ లో అంతకుమించిన సీన్ క్రియేటైంది.... బీహార్ లో ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభకే అనుమతి లభించలేదు... దీనికి అక్కడి కలెక్టరు భద్రత కారణాలు చూపిస్తున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.
బీహార్ లో నక్సల్ ప్రభావిత కైమూర్ ప్రాంతంలో సోమవారం జరగాల్సిన ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ర్యాలీకి కలెక్టర్ దేవేశ్ సెహ్రా అనుమతి నిరాకరించారు. దీనితో అతి తక్కువ మందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంటూ బిజెపి మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. భాభువా స్టేడియం మైదానంలో మోడీ సభను నిర్వహించడానికి బిజెపి అనుమతి కోరగా, భద్రతా కారణాల రీత్యా దేవేశ్ సెహ్రా అనుమతిని నిరాకరించారు. దీనితో 30 వేలమందికి మించకుండా అక్కడ సభను నిర్వహిస్తామని పేర్కొంటూ బిజెపి మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా, మైదానంలోకి ప్రవేశించే మార్గాలు, మైదానం పరిమాణం ఎంత మొదలైన విషయాలను పరిశీలించి తరువాత నిర్ణయం తీసుకుంటామని సెహ్రా చెప్పారు.
దేశ ప్రధాని హాజరయ్యే సభ కావడంతో భద్రత పరంగా కలెక్టరుకు బాధ్యతలు ఉండడం నిజమే కానీ... అదే అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడానికో.. ప్రాజెక్టు ప్రారంభించడానికో ప్రధాని వస్తే... అప్పుడు కూడా అనుమతి ఇవ్వకుండా ఆపగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం బీహార్ లో పాలక పార్టీ ఆదేశాలు పాటించడం వల్లే కలెక్టరు స్థాయి అధికారి ప్రధాని సభకు అనుమతి నిరాకరించే ధైర్యం చేశారని.... లేదంటే అలా చేయడం అసాధ్యమని అంటున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో ఫలితాలపై వస్తున్ సర్వేలు మోడీని ఇప్పటికే కలవరపెడుతుండగా తాజాగా ఇలాంటి అవమానాలు మరింత రగిలిస్తున్నాయట.