త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ నానా తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు - టీడీపీ మంత్రులు నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నంద్యాలలో వరాల జల్లు కురిపిస్తున్నారు. అక్కడ ఓటర్లను భయపెట్టో - బతిమలాడో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అక్కడ రాజకీయ వేడి మరింత రాజుకుంది. అధికార - ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల అనంతరం చంద్రబాబు పరిస్థితి ఏంటన్నది టీడీపీ నేతలు కలలోనైనా ఊహించలేరన్నారు. ఎన్నికలయ్యాక ప్రజలు ....చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
టీడీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు గుంపులు గుంపులుగా నంద్యాలకు క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సింహం లాంటి వారని, ఆయన నంద్యాలకు సింగిల్ గా వస్తారని చెప్పారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వారికి కలలో కూడా జగనే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగితం మీద రాసిచ్చిన వ్యాఖ్యలు తప్ప ఇతర విషయాలు మాట్లాడలేని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు. రాజధాని విషయంలో కేఈ ని ఎందుకు తప్పించారో గుర్తుంచుకోవాలన్నారు. చివరికి ఆర్డీవోలు, ఎమ్మార్వోలను బదిలీ చేసుకోలేని మంత్రి కేఈ అని ఎద్దేవా చేశారు.
ఇంటి పక్కనే నకిలీ ఎరువులు తయారు చేయడంలో ఘనత సాధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అలాంటి వ్యక్తి సంస్కారం గురించి మాట్లాడటం గురివింద నీతులు చెప్పినట్లుగా ఉంటుందన్నారు. సొంత జిల్లాలో నీతులు చెప్పినా సోమిరెడ్డి నవ్వులపాలు కావడం తథ్యమన్నారు.'ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. కాగా నేడు టీడీపీ నేతలు సిగ్గులేకుండా కేసుల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టలు గురించి మాట్లాడే దమ్ములేని చంద్రబాబు, సోమిరెడ్డిలకు వైసీపీ నేతల గురించి మాట్లాడే అర్హత లేదు. ఓటుకు కోట్లు కేసులో భయపడి ఏపీకి ప్రత్యేకహోదాపై పోరాటం చేయని వ్యక్తి చంద్రబాబు కాదా' అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అని అన్నారు.